రాజకీయ నాయకులను కదిలించిన సినిమా ఇదే..

Satvika
సినిమా కేవలం వినోదాన్ని పంచడమే కాదు.. తెలియని విషయాలను తెలియజేసేవి.. మంచి మరియు చెడు లను కలిగి ఉంటాయి. మంచిని తీసుకుంటే మనలో మార్పు వస్తుంది. కొన్ని సినిమాలు సమాజంలో మార్పును తీసుకొచ్చేవిగా ఉంటాయి. అలాంటి సినిమాలు రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. రాజకీయాల్లో మార్పులకు ఇలాంటి సినిమాలు చాలా ప్రముఖమైనవి అని అంటున్నారు.

తెలుగులో రాజకీయ కథా నేపథ్యంలో వచ్చిన సినిమా లీడర్.. రానా దగ్గుపాటి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే భారీ హిట్ టాక్ ను అందుకున్నాడు. తన తండ్రి చనిపోతే అతను స్థానంలో ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవైపు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన , మరోవైపు రాజకీయ నేతల ఒత్తిడి ఇవ్వన్నీ తట్టుకొని ప్రజలకు ఎలా సేవలను అందిస్తాడు అన్నది ఈ సినిమా కథ.

 ఈ సినిమాలో అర్జున్ ప్రసాద్ పాత్రలో నటిస్తాడు. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తుంది. ఎటువంటి అనుభవం లేని వాళ్ళు రాజాకీయాల్లో వస్తే పస్థితులు ఏంటి.. ఎలా సమాజంలో నాయకుడుగా నిలబడతాడు..

 సీఎం అయిన తర్వాత ప్రజలకు ఎటువంటి పథకాలను అందిస్తే మంచి జరుగుతుంది. ఈ విషయాలను దర్శకుడు ఎంతో చక్కగా చూపించాడు. ముఖ్యమంత్రి అయిన అర్జున్ ప్రసాద్ ను తన దారిలోకి తీసుకొచ్చేందుకు  హీరో పెద్దనాన్న విశ్వప్రయత్నాలు చేస్తాడు. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల నల్ల ధనాన్ని బయటికి తీసి ప్రజలకి అందేలా చూడాలన్న లక్ష్యంతో ఉన్న అర్జున్ ప్రసాద్ తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం తన పార్టీకి ప్రధాన మద్దతుదారయిన మునుస్వామి కూతురితో ప్రేమలో ఉన్నట్లు నటిస్తాడు. తానూ ఈ పదవిలో ఉండలేక రాజీనామా చేస్తాడు.

చివరికి ప్రజలు అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. ఈ సినిమాతో రానా పేరు మారు మోగింది. తర్వాత వరుస హిట్ సినిమాలలో నటించాడు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టు లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: