ఒక్క హిట్టు కొట్టు గురూ... ?

Satya
హిట్ కి ఉన్న మజా వేరు. దాంతోనే స్టామినా ఏంటో తెలుస్తుంది. గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు వీలు ఉంటుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు హిట్లు, సూపర్ హిట్లు ఎక్కువగా ఉండేవి. అలాగే ఏవరేజ్, బిలో ఏవరేజి మూవీస్ కి కూడా విలువ ఉండేది. కానీ ఇపుడు చూస్తే అయితే హిట్టూ లేకపోతే ఫట్టే. ఒక్క దెబ్బతో జాతకం తేలిపోతోంది.
మరి హిట్ ఉంటేనే మనుగడ ఉండే కమర్షియల్ వరల్డ్ లో  ఫ్లాప్స్ భారాన్ని ఎంతటి గొప్ప హీరో అయినా ఎన్నాళ్ళు  మోయగలరు. దాంతో హిట్టు కోసం పరితపించే వారు ఇపుడు ఎక్కువ అయిపోయారు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు కొన్నేళ్ళుగా హిట్లు లేవు అంటే నమ్మబుద్ధి కావడం లేదు కానీ ఇది నిజం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి విషయనికి వస్తే ఆయన  రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్  అయింది. ఆ తరువాత ఎంతో ఇష్టంతో చేసిన సైరా నరసింహారెడ్డి బాగానే ఆడింది కానీ సూపర్ హిట్ కిక్కు అయితే ఇవ్వలేదు. దాంతో ఆచార్య మీద ఆయనకు చాలా పెద్ద  ఆశలు ఉన్నాయట.
బాలయ్య విషయానికి వస్తే ఆయనకు నాలుగేళ్ళుగా సరైన హిట్ లేదు. ఎపుడో 2017లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి తరువాత కరవు తీర్చే హిట్ కోసం ఆయన చూస్తున్నారు. నాగార్జునకు అయితే నాలుగేళ్ళుగా హిట్ అన్నదే లేదు అంటున్నారు. ఇక ఆయన ఇద్దరు కుమారులకు కూడా అర్జంటుగా హిట్లు కావాలి. యంగ్ హీరోలలో విజయ దేవరకొండకు కూడా హిట్ పడి చాలా కాలమే అయింది. నాచురల్ స్టార్  నాని విషయం తీసుకున్నా అంతే. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ తో మంచి హిట్ కోసం చూస్తున్నారుట. ఇలా పెద్ద హీరోల నుంచి మీడియం రేంజి హీరోలు, సీనియర్ హీరోలు అంతా హిట్ అంటూ కలవరిస్తున్నారు. మరి వారికి ఒక్క హిట్టు అయినా కొట్టించే బాధ్యత ప్రేక్షక దేవుళ్ళదే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: