హిట్లు లేవు అయినా వరుసగా నాలుగు సినిమాల్లో యువ హీరో..!
ఇదే కాకుండా భాస్కర్ బంటుమిల్లి డైరక్షన్ లో కూడా ఒక సినిమాకు సైన్ చేశాడు ఆది. ఆ సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ మూడు సినిమాలు చేయాల్సి ఉండగా లేటెస్ట్ గా మరో సినిమా ఓకే చేశాడు ఆది. కళ్యాణ్ జీ డైరక్షన్ లో ఆది హీరోగా సినిమాకు ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్నారు. సినిమాలైతే చేఏస్తున్నాడు కాని ఆది పర్ఫెక్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన సిన్నిమా లేదని చెప్పాలి. అయినా సరే ఆది మాత్రం తన సినిమాల వేగాన్ని తగ్గించట్లేదు.
రీసెంట్ గా శశి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆది కాని ఆ సినిమా కూడా నిరాశపరచింది. ఇక చేస్తున్న నాలుగు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టు పడినా ఆది ట్రాక్ లోకి వచ్చేసినట్టే. ఫలితాలతో సంబంధం లేకుండా ఆది మాత్రం తన ప్రయత్నాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆది కోరుకునే సూపర్ హిట్ సినిమా ఈ నాలుగింటిలో ఏది అవుతుందో చూడాలి. శుక్రవారం ముహుర్తం పెట్టుకున్న కళ్యాణ్ సినిమాకు సంబందించిన హీరోయిన్, మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో వెల్లడిస్తారని తెలుస్తుంది. జోరు చూస్తుంటే ఆది సాయి కుమార్ ఫేట్ మారే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది.