ఏపీ తెలంగాణ‌లో బొమ్మ‌ప‌డేది అప్పుడే.. !

MADDIBOINA AJAY KUMAR
కరోనా దెబ్బకు ఎప్పుడూ జ‌నాల‌తో కళకళలాడే సినిమా థియేటర్లు మూత పడ్డాయి. వారానికి రెండు మూడు సినిమాలు రిలీజై నిర్మాతలకు ,నటీనటులకు కాసుల కురిపించే థియేటర్ల‌కు క‌రోనాతో క‌ష్టాలు వ‌చ్చాయి. దాంతో థియేట‌ర్ల య‌జ‌మానులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. కరోనా కార‌ణంగా గత ఏడాదిగా థియేటర్లు కంటిన్యూగా నడిచింది లేదు. క‌రోనా కేసులు తగ్గడం మళ్లీ పెరగడగ‌టం ఇల‌లా ఏడాది ఏడాదిన్న‌ర కాలంగా జ‌రుగుతూ ఉండ‌టంతో థియేటర్ లు మూతపడటం మళ్లీ తెరుచుకోవడం.... ఇలానే జరుగుతూ వస్తోంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ విజృంభ‌ణతో మూత‌ప‌డ్డ థియేట‌ర్లు కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తెరుచుకున్నాయి. దాంతో ప్ర‌భుత్వం మొదటగా 50% సిటింగ్ పర్మిషన్ తో థియేటర్లకు అనుమ‌తిని ఇచ్చింది. 

అయితే ముందుగా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా..? అన్న‌ అనుమానం థియేట‌ర్ల యాజ‌మాన్యంలో మ‌రియు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో క‌లిగింది. కానీ క్రాక్ సినిమా విడుదల కావడం 50 శాతం సీటింగ్ సీటింగ్ లోనూ రికార్డు కలెక్షన్లు సాధించడం తో అనుమాల‌కు చెక్ పడింది. ఆ తర్వాత విడుదలైన ఉప్పెన సినిమాకు కురిసిన క‌లెక్ష‌న్ల వ‌ర్షంతో ఇక డోకాలేద‌ని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో వ‌చ్చి ఇండ‌స్ట్రీకి షాక్ ఇచ్చింది. కేసులు వేగంగా పెరగడంతో థియేటర్లు మూత పడ్డాయి. ఇక ఇప్పుడు మళ్ళీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్లు మాత్రం రాత్రి కర్ఫ్యూ తీసివేసే వరకు సినిమాలను రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారట. నైట్ కర్ఫ్యూ తీసివేసిన త‌ర్వాత అయితే నాలుగు షోలు వేస్తార‌ని కాబ‌ట్టి ఏపీ, తెలంగాణలో అప్పుడే సినిమాలు రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ జూలై మొదటి వారంలో లేదా రెండో వారంలో పూర్తిగా ఎత్తివేసే అవకాశాలున్నాయి. దాంతో జూలై మొద‌టి వారం లేదంటే రెండో వారంలో సినిమాలు విడుద‌ల్లే ఛాన్స్ ఉంది. ఇక థియేట‌ర్ లో సినిమా చూడాల‌ని ఎంత‌గానో వెయిట్ చేస్తున్న‌వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అంతే కాకుండా థియేటర్లు రీ ఓపెన్ అవ్వ‌గానే విడుదలకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ, నాని హీరోగా నటించిన జగదీష్, రానా సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలున్నాయి. మరి క‌రోనా సెకండ్ వేవ్ త‌ర‌వాత థియేట‌ర్లు తెరుచుకుంటున్న నేప‌థ్యంలో  ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: