షాకింగ్: సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్... ?
అయితే ఇప్పుడు అది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇందులో కాజల్ తో పాటు, ప్రముఖ నటుడు సుబ్బరాజు కూడా కనిపించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ కు కాజల్ భారీగానే రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కూడా హాట్ స్టార్ లోనే స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులోనూ ఈ వెబ్ సిరీస్ లో కాజల్ అగర్వాల్ కాలేజీ గర్ల్ గా అల్లరి చేయనున్నారట.
అయితే ఇది ఎంతవరకు నిజం అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న‘ఆచార్య’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. ఇప్పటికే తమన్నా వరుస పెట్టి వెబ్ సిరీస్ లు చేస్తుండగా, ఇక ముందు ముందు ఇంకెంతమంది వెబ్ సిరీస్ ల పట్ల ఆకర్షితులవుతారో తెలియడం లేదు.