రజనీకాంత్ అమెరికా ప్రయాణం పై మొదలైన మీడియా హడావిడి !

Seetha Sailaja
సూపర్ రజినీకాంత్ తమిళ రాజకీయాలలో తన సత్తా చాటుతాడు అని అతడి అభిమానులు భావిస్తే చివరి నిముషంలో అందరికీ షాక్ ఇస్తూ తన రాజకీయ పార్టీ ఆలోచనలు విరమించుకున్నాడు. ప్రస్తుతం అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘అన్నాత్తై’ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఆ మూవీకి అతడి డబ్బింగ్ పూర్తి చేయవలసి ఉంది.


అయితే ఆ డబ్బింగ్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకుండానే రజనీకాంత్ కుటుంబ సమేతంగా తన ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా ప్రయాణం అవ్వడంతో మళ్ళీ కోలీవుడ్ మీడియా రకరకాల ఊహాగానాలు మొదలు పెట్టింది. ఈమధ్య ‘అన్నాత్తై’ మూవీ షూటింగ్ చివరి రోజున రజనీ భావోద్వేగానికి లోనవుతూ తనకు ఇంకా రెండు మూడు సినిమాలు చేయాలని ఉందనీ అయితే భగవంతుడు అవకాశం ఇస్తాడో లేదో తెలియదు అని ఆ మూవీ యూనిట్ సభ్యులతో కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చిన తరువాత ఇప్పుడు రజనీకాంత్ అమెరికా ప్రయాణం అవ్వడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.


కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రజనీకాంత్ గతంలో తనకు వచ్చిన అనారోగ్య సమస్యలకు వైద్యం చేసిన హాస్పటల్ కు వెళుతున్నట్లు తెలుస్తోంది. 5 సంవత్సరాల క్రితం రజనీకాంత్ కు కిడ్నీ మార్పిడి జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆయన అమెరికా వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. అయితే ఈసారి వైద్య పరీక్షలు పూర్తి అయి రజనీకాంత్ తిరిగి ఇండియా వచ్చే వరకు ధనుష్ రజనీకాంత్ తోనే ఉంటాడని వార్తలు బయటకు రావడంతో కోలీవుడ్ మీడియాకు ఈవిషయం హాట్ టాపిక్ గా మారింది.


ప్రస్తుతం అమెరికాకు ఇండియా నుండి డైరెక్ట్ ఫ్లైట్ నడవక పోవడంతో చెన్నై నుంచి దోహాకు అక్కడ్నుంచి అమెరికాకు కనెక్టింగ్ ఫ్లయిట్ లో అమెరికా వెళుతున్నట్లు మీడియా వార్తలు రాస్తోంది. అమెరికాలో రజనీకాంత్ విశ్రాంతి తీసుకుంటూ ఉండగానే మధ్యలో ఒకసారి ధనుష్ చెన్నై వచ్చి వెళతాడు కాని అప్పటి వరకు తాను షూటింగ్ లకు అందుబాటులో ఉండను అని చెప్పినట్లు వార్తలు వస్తూ ఉండటంతో అసలు రజనీకాంత్ కు మాల్లీ ఏమైంది అంటూ చెన్నైలో వార్తల హడావిడి మొదలైంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: