దళపతి గురించి మనకు తెలియని మరి కొన్ని విషయాలు..

Divya

విజయ్ దళపతి.. ఈయన కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో. విజయ్ అసలు పేరు జోసఫ్ విజయ్. విజయ్ 1974 జూన్ 22వ తేదీన ఎస్ఏ చంద్రశేఖర్, శోభ దంపతులకు మద్రాస్ లో జన్మించారు. విజయ్ కు విద్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈ పాప తన రెండేళ్ళ వయసులోనే మరణించడంతో విజయ్ కెరియర్ పై బాగా ప్రభావం చూపింది. విజయ్ తల్లి చెప్పిన వివరాల మేరకు.. విజయ్ చిన్నతనంలో చాలా చురుగ్గా ఉండేవాడని,  తన సోదరి చనిపోగానే పూర్తిగా చురుకుదనం కోల్పోయాడు అని.. ఇక విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కూడా కోలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు. విజయ్ తన తండ్రి దర్శకత్వంలో ఎన్నో సినిమాలను కూడా తీసి మంచి హిట్ ను అందుకున్నాడు.

విజయ్ మొదట కోలీవుడ్ లో చిత్ర రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ఒక స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయనకు సౌత్ ఇండియా అంతటా అభిమానులు కూడా ఉన్నారు అందులో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ రోజు విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా ఈయన గురించి మనకు తెలియని మరికొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. విజయ్ సినీఇండస్ట్రీలో దళపతి కాకముందు ఈయన టాలీవుడ్ చిత్రాలను రీమేక్ చేసేవారు. ఇక దళపతి అయిన తర్వాత ప్రస్తుతం భారత దేశమంతటా ఈయన సినిమాలను రీమేక్ చేస్తుండటం గమనార్హం. విజయ్ నటించిన కత్తి సినిమా హిందీలో అక్షయ్ కుమార్ రీమేక్ చేయబోతున్నారు. అలాగే విజయ్ నటించిన బిగిల్, మాస్టర్ చిత్రాలు కూడా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి.

2. విజయ్ నటించిన బిగిల్ సినిమాలో రాజప్ప క్యారెక్టర్ కోసం సత్యరాజును ఎంచుకున్నారు. కాకపోతే విజయ్ డబుల్ రోల్ చేస్తే బాగుంటుందని, ఆయనే డబుల్ రోల్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

3. విజయ్ తన చెల్లి చనిపోవడంతో తీవ్రంగా ఏడ్చాడట. ఇక ఈ విషయాన్ని తన తల్లి ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది . అంతేకాదు విజయ్ భార్య కూడా విజయ్ కు వీరాభిమాని. విజయ్ కోసమే ఆమె లండన్ నుంచి వచ్చి మరీ కలిసి , ఆ తర్వాత ప్రేమించి  1999 ఆగస్టు 25వ తేదీన పెళ్లి చేసుకుంది.



4. ఇప్పటికీ విజయ్ దళపతి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండరు. ఒకవేళ ట్విట్టర్లో ఉన్నా కూడా సంవత్సరానికి 6 నుంచి 7 ట్వీట్లు మాత్రమే చేస్తాడు. అప్పుడు అవి ఇండస్ట్రీ రికార్డు కొట్టడం మరో విశేషం.

5. విజయ్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను కోలీవుడ్ లో  రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలాగే మహేష్ బాబు ఒక్కడు సినిమా తమిళ్ లో గిల్లీ పేరిట రీమేక్ చేసి , రూ.50 కోట్లు షేర్ రాబట్టి , రజనీకాంత్ రికార్డ్స్ ను కూడా బ్రేక్చేశారు.

6. విజయ్ దళపతికి ఇష్టమైన డైరెక్టర్ అట్లీ. ఈయన తీసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ అందులో మూడు విజయ్ నటించడం విశేషం. అదిరింది, బిగిల్, పోలీసోడు వంటి చిత్రాలు తీసి ఇండస్ట్రీ సూపర్ హిట్ కొట్టాడు.

7. పులి సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దళపతి.. కానీ ఇదే ఆయన సినీ కెరియర్ లో పెద్ద డిజాస్టర్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: