ఆ సినిమాలో ఆంటీగా మెరిసిన గౌతమి..!

Suma Kallamadi
1987 జూలై 7వ తేదీన విడుదలైన గాంధీ నగర్ రెండో వీధి సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన హీరోయిన్ గా గౌతమ్ నటించారు. ఈ చిత్రంతోనే ఆమె తెలుగు పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బజార్ రౌడీ, తోడల్లుళ్ళు వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. సూపర్ హిట్ కామెడీ చిత్రం "బామ్మ మాట బంగారు బాట" లో కూడా ఆమె కథానాయిక పాత్ర పోషించారు. అయితే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ శ్రీకాకుళం లో జన్మించారు.

తెలుగు నేలపై పుట్టినప్పటికీ ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. వయసు పైబడిన తర్వాత ఆమె బుల్లితెర నటీమణిగా, వ్యాఖ్యాతగా కూడా పని చేశారు. అయితే హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన గౌతమి సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమె నటనారంగంలో అడుగుపెట్టారు. 48 సంవత్సరాల వయసులో ఆమె మనమంతా చిత్రంలో ఆంటీ గా కనిపించారు.


దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి రూపొందించిన ఆంథాలజీ ఫిల్మ్ "మనమంతా" చిత్రంలో ఆమె ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో చాలా చక్కగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. సహజ నటనతో ఆమె అబ్బురపరిచారు. ఆమె స్నేహితురాలిగా నటించిన ఊర్వశి కూడా అద్భుతంగా నటించి మెప్పించారు. వీరిద్దరి పాత్రలు మన పక్కింటి ఆంటీలను గుర్తు చేస్తాయి. మధ్యతరగతి గృహిణిగా నటించిన గౌతమి కి డబ్బింగ్ కూడా చాలా బాగా సూట్ అయ్యింది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏడు కోట్ల రూపాయలను వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. గౌతమి దృశ్యం సినిమాకి రీమేక్ గా వచ్చిన తమిళ ఫిల్మ్ పాపనాశం లో ఎస్తేరు అనిల్, నివేదా థామస్ లకు తల్లిగా నటించారు.


ఇకపోతే ప్రస్తుతం గౌతమి తుప్పరివాలన్ 2 అనే ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్ హీరో విశాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది కూడా ఆయనే. ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటిస్తున్నారు. అయితే కమల్ హాసన్ నటించనున్న పాపనాశం 2 చిత్రం లో గౌతమి నటించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజా నివేదికల ప్రకారం ఆమె పాపనాశం 2 సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: