ఆర్ఆర్ఆర్: స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్..!
అయితే ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట ఎనిమిది నిమిషాల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది. పవర్ఫుల్ లిరిక్స్ తో అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ పాట రూపొందిస్తున్నారని సమాచారం. నిర్మాతలు కూడా ఈ సాంగ్ కోసం కోట్లలో రూపాయలు వెదజల్లుతున్నారని.. త్వరలోనే పాటకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో టాక్. ఇప్పటికే ఈ పాట కోసం ప్రత్యేకమైన భారీ సెట్ నిర్మించారని తెలుస్తోంది. అయితే ఈ పాటలో రామ్ చరణ్, తారక్ ఉగ్ర అవతారాల్లో కనిపించి ప్రేక్షకులకు కేకపుట్టించనున్నారని కూడా తెలుస్తోంది. ఈ పాట తో సినిమా వేరే లెవెల్ కి వెళ్తుందని.. ప్రేక్షకులను మరొక ప్రపంచానికి తీసుకెళ్తుందని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే ఆర్ఆర్ఆర్ లో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, సముద్రఖని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. దీనితో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది.