విజయ్ చెప్పేసాడు.. బాధ్యత మొత్తం పూరీదే ఇక..!
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా వస్తుంది. అయితే ఓటిటి రిలీజ్ పై తన మార్క్ రెస్పాండ్ అయిన విజయ్ భారం మొత్తం పూరీ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరీ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. విజయ్ లాంటి డ్యాషింగ్ హీరోతో పూరీ చేస్తున్న లైగర్ సినిమా 200 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తుందని విజయ్ అంచనా వేశాడు. అయితే విజయ్ చెప్పిన దాన్ని బట్టి పూరీ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ లో తెరకెక్కిస్తున్నాడని అనిపిస్తుంది.
ఇప్పటికే లైగర్ సినిమా నుండి వస్తున్న పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. సెప్టెంబర్ 7 సినిమా రిలీజ్ ప్లాన్ చేఏసినా షూటింగ్ వాయిదా పడటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో విజయ్ నేషనల్ లెవల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే తేడా కొడితే మాత్రం సినిమా లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ మాత్రం లైగర్ సినిమాను తన ఖాతాలో మరో హిట్ వేసుకోవడం పక్కా అన్నట్టుగా ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. సినిమా అవుట్ పుట్ కూడా అదే రేంజ్ లో వస్తుందని తెలుస్తుంది.