'బంగార్రాజు' తో రీఎంట్రీ ఇవ్వనున్న అలనాటి స్టార్ హీరోయిన్..?

Anilkumar
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలా కాలం తర్వాత నాగ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం పోషించారు.ఇక నాగ్ సరసన హీరోయిన్ పాత్రల్లో సీనియర్ నటి రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు.2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టి.. బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది.దీంతో ఈ సినిమాకి సీక్వెల్  గా 'బంగార్రాజు' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ..ఆ ప్రాజెక్ట్ ని తెరక్కించడానికి ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నాగ్ మాత్రం గతంలో ఈ సీక్వెల్ పై అంతగా ఆసక్తి చూపలేదు.


ఇక ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న నాగ్.. తాజాగా బంగార్రాజు ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు ఇటీవలే మీడియా వేదికగా ప్రకటించాడు.దీంతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతీ ఒక్క అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.ఇప్పటికే ఈ సినిమాలో అక్కినేని వారసులు అఖిల్, చైతూ లతో పాటూ మరో కీలక పాత్రలో సమంత నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఆ తర్వాత సమంత ప్లేస్ లో తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ని సెలెక్ట్ చేసినట్లుగా టాక్ నడిచింది.ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


ఇక అందుతున్న సమాచారం ప్రకారం బంగార్రాజు లో ఒకప్పటి అగ్ర హీరోయిన్ జయప్రదను ఓ కీలక పాత్ర కోసం ఇటీవలే చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది.దర్శకుడు కళ్యాణ్ స్వయంగా ఆమెను కలిసి తన పాత్ర గురించి వివరించాగా.. అది ఆమెకి నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ సినిమా కోసం ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చిందట జయప్రద.కాగా గత కొంతకాలంగా జయప్రద వెండితెరపై కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో బంగార్రాజు సినిమాతో ఈమె మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుండడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక ఈ సినిమాతో పాటూ ఓ వెవ్ సీరీస్ లో కూడా నటిస్తోందట జయప్రద..ఇక ఈ సీక్వెల్ లో కూడా నాగ్ కి జోడిగా రమ్యకృష్ణ కనిపించనుందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: