నాని తెలివి తేటలు మాములుగా లేవుగా..!!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన వారిలో నాని ఒకరు. ఆయన క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. నాని ఇంద్రగంటి కంట్లో పడడంతో ‘అష్టా చమ్మా సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైయ్యారు. వరుస అవకాశాలను అందుకొని నాని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు.. నాని హీరో నుండి నిర్మాతగా మారారు. ఇక నాని చేసిన మొదటి చిత్రం అ! ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత విశ్వక్ సేన్ తో ‘హిట్’ అనే థ్రిల్లర్ మూవీ చేసాడు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో నానికి లాభాలను తీసుకొచ్చింది.

నాని కేవలం రెండే రెండు షెడ్యూల్స్ లో ఈ చిత్రాలను పూర్తి చేశారంట. ఇక ప్రస్తుతం `మీట్ క్యూట్` అనే చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఓ లేడీ ఓరియెంటెడ్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో కూడా  5 లేదా 6 మంది హీరోయిన్లు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా కోసం నాని  మంచి క్రేజ్ ను ఉన్న హీరోయిన్లనే ఎంపిక చేశారని సమాచారం. ఇక వీళ్ళు రెండు రోజులు షూటింగ్ లో పాల్గొంటే చాలు వీళ్ళ పార్ట్ ఫినిష్ అయిపోతుందని సమాచారం. అంతేకాదు.. వీళ్ళు డబ్బింగ్ కూడా ఈ రెండు రోజుల్లోనే చెప్పేస్తారంట. అందుకోసం ఆ హీరోయిన్ల‌కు నాని గెస్ట్ రోల్స్ అని చెప్పి ఒప్పించారంట. సాధారణంగా ఒక్కటి రెండు రోజుల పాత్ర‌లంటే  అంటే సినిమాకు ఎవరు ఒప్పుకోరు.

అయితే ఒకవేళ ఒప్పుకున్నా అందుకు భారీగా డిమాండ్ చేస్తుంటారు. ఇక నాని క్రేజ్ ఉన్న హీరో కాబట్టి.. తర్వాత సినిమాలో ఛాన్స్ ఇస్తాడేమో అని భావించి వీళ్ళు ఓకె చెప్పేస్తున్నట్టు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ సినిమాను రూ.3 కోట్ల బడ్జెట్ లోఫినిష్ చేసినట్లు తెలుస్తుంది. ఇక  బిజినెస్ పరంగా చూసుకుంటే తక్కువలో తక్కువ శాటిలైట్,డిజిటల్, థియేట్రికల్ ఇలా అన్నీ కలుపుకుని రూ.10 కోట్ల వరకు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాని కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడనే మంచి పేరు కూడా ఉంది. ఏది ఏమైనా నాని తెలివితేటలను తీరాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: