కేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ.. చిత్తయ్యేది ఎవరో..?
ఇదిలా ఉండగా.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా కూడా సెప్టెంబర్ నెలలోనే విడుదల కానుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించిందట. అయితే ఈ విధంగా చూసుకుంటే.. కేజీఎఫ్ చాప్టర్ 2, అఖండ సినిమాలు కొద్ది గంటల వ్యవధిలోనే థియేటర్లలో విడుదలవుతాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన అఘోరా తరహా పాత్ర పోషిస్తున్నారు.
అయితే డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో సినీ ప్రేక్షకులు బాలకృష్ణ సినిమాలను ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐతే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీనిని బట్టి బాలకృష్ణ సినిమా అఖండ, యష్ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకే సమయంలో విడుదలయితే.. బాక్సాఫీస్ వద్ద ఎంతటి పోటీ నెలకొంటుందో ఊహించుకోవచ్చు. మరి కేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ పడితే.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిత్తయ్యేది ఎవరో కాలమే సమాధానం చెప్పాలి.