త్వరలో మా మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాంతో రాష్ట్ర రాజకీయల కంటే ఇప్పుడు సినిమా రాజకీయాలపైనే అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి కారణం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జరిగే రాజకీయాలే. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నో వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. చాటుగా కాకుండా ఏకంగా స్టేజిపైనే సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంధర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. అంతే కాకుండా ఈ సారి ఎన్నికల్లో నలుగురు సభ్యులు పోటీగి దిగుతుండటం వారిలో ఒకరు కర్నాటక కు చెందిన ప్రకాష్ రాజ్ ఉండగా మరొకరు యంగ్ హీరో మంచు విష్ణు కూడా ఉండటం ఆసక్తి రేకెత్తిస్తుంది.
మరోవైపు ఇద్దరు మహిళలు జీవిత, హేమ కూడా పోటీలో ఉండటం ఆసక్తి రేపుతోంది. వీరిలో ప్రకాశ్ రాజ్ కు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు.
అంతే కాకుండా నాగబాబు కూడా ఈసారి తన మద్దతు ప్రకాశ్ రాజ్ కే ఇస్తున్నా అని భహిరంగంగా ప్రకటించారు. ఇక మంచు విష్ణు తండ్రితో కలిసి సీనియర్ హీరోల వద్దకు వెలుతూ మద్దతు కోరుతూ మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు హేమ తాను గతంలో మాలో వివిధ పదవులు చేపట్టానని పలువురు మహిళలు తనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడంతో రంగంలోకి దిగినట్టు స్పష్టం చేశారు. మరోవైపు నటి జీవితతో రాజీ కుదుర్చుకునే పనిలో మంచువిష్ణు ఉన్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ప్రకాశ్ రాజ్ నేడు తన ప్యానల్ సభ్యులను ప్రకటించేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో త్వరలో జరగబోయే మా ఎలక్షన్స్‌ని పురస్కరించుకుని... 'మా' శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్టకోసం..నటీ నటుల బాగోగుల కోసం..నటీనటులందరి ఆశీస్సులతో.. అండదండలతో.. ఎన్నికలలో నిలబడటం కోసం.. పదవులు కాదు పనులు మాత్రమే చేయటం కోసం.. 'మా' టీంతో రాబోతున్నాను. అంటూ పేర్కొన్నారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ లో సభ్యులుగా 1. ప్రకాష్‌రాజ్ 2. జయసుధ 3. శ్రీకాంత్ 4. బెనర్జీ 5. సాయికుమార్ 6. తనీష్ 7. ప్రగతి 8. అనసూయ 9. సన 10. అనిత చౌదరి 11. సుధ 12. అజయ్ 13. నాగినీడు 14. బ్రహ్మాజీ 15. రవిప్రకాష్ 16. సమీర్ 17. ఉత్తేజ్ 18. బండ్ల గణేష్ 19. ఏడిద శ్రీరామ్ 20. శివారెడ్డి 21. భూపాల్ 22. టార్జాన్ 23. సురేష్ కొండేటి 24. ఖయ్యుం 25. సుడిగాలి సుధీర్ 26. గోవిందరావు 27. శ్రీధర్‌రావు మరి కొందరు ప్రముకులు ఉన్నారని పేర్కొన్నారు.