పోసాని గారే..నాకు లైఫ్ ఇచ్చారు అంటున్న బి.వి.ఎస్.రవి..

Divya

సినీ ఇండస్ట్రీలో బీ.వీ.ఎస్.రవి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.అనతికాలంలోనే రచయితగా మంచి గుర్తింపు పొందారు. అంతే కాకుండా పెద్ద పెద్ద వాళ్లకు స్టార్ హీరోల ఎన్నో సినిమాలకు కూడా ఈయన రచయిత గా పని చేయడం విశేషం. అంతే కాదు ఆయన రచయితగా చేసిన ఎన్నో సినిమాలు మంచి మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇక డైలాగులు రాయడంలో తనకు మించిన రచయిత మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక కథకి ఏ అంశాలు అవసరం అవుతాయి.. ఎలాంటి అంశాలను సినిమాలో చేకూర్చాలి.. ఏ విషయాన్ని ఎక్కడ చెప్పాలి.. ఎక్కడ దాచాలి.. అనే విషయాలను బాగా వడకట్టి నేర్చుకున్న వ్యక్తి.


అయితే ఇంతటి గొప్ప రచయితగా గుర్తింపు పొందిన బీ.వీ.ఎస్.రవి ఇటీవల నటనవైపు , దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా తను ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూ ద్వారా బీవీఎస్ మాట్లాడుతూ.." సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే నాకు సినిమాల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉండేది. ఇక అంతేకాదు దర్శకత్వం చేయాలని నా కల కూడా.. మొదట రచయితగా మంచి పేరు సంపాదించుకోవాలని ఉద్దేశంతోనే, నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కొరటాలశివ కారణమైతే , ఇక్కడ ఒక రచయితగా నిలదొక్కుకోవడానికి కారణం పోసాని కృష్ణ మురళి గారు.

దర్శకుడు కొరటాల శివ నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు మాత్రమే కాదు.. నా క్లాస్మేట్ కూడా. ఇక కొరటాల శివ మేనమామ పోసాని కృష్ణ మురళి గారు. అలా నా స్నేహితుడి ద్వారా నేను పోసాని గారిని కలవడం జరిగింది. ఇక అంతే కాదు నా మనసులో ఉన్న మాటను కూడా ఆయనతో చెప్పాను. అయితే ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్న కష్టాల గురించి, ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే అంత ఆషామాషీ కాదు   అంటూ చదువు పూర్తి చేసుకుని ,ఉద్యోగం చేసుకోమని కూడా సలహా ఇచ్చారు.


పోసాని గారు మొదట నన్ను బెడ్ రూమ్ లో ఉంచి మాట్లాడారు.. ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్ లో ఉంచి మాట్లాడారు.. ఇంకా ఆ తర్వాత మూడో రోజు హాల్ లో ఉంచి, వెయిట్ చేయించారు. అలా మొత్తం ఆరు నెలల పాటు ఆయన కోసం ఎదురు చూసాను . ఇక ఆయన నన్ను పిలిచి.  నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మంచిగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటావు అనుకున్నాను . కానీ నీకు సినీ ఇండస్ట్రీ పై ఉన్న మక్కువ ఏంటో నాకు అర్థం అయింది. ఇక చివరికి నా పట్టుదలను అర్థం చేసుకున్న ఆయన సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సహాయం చేశారు.. ఇక అంతే కాదు ఆయన దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను" అంటూ బీవీఎస్ రవిచెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: