సేఫ్ గేమ్ తో స్థిరపడాలన్న ఆలోచనలలో నితిన్ !
నితిన్ ఈ సంవత్సరం మూడు సినిమాలు విడుదల చేసి యంగ్ హీరోలలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చాల వ్యూహాత్మకంగా ప్రవర్తించాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘చెక్’ మూవీని మార్చిలో ‘రంగ్ దే’ మూవీని విడుదల చేసారు.
వాస్తవానికి నితిన్ ఈ మూవీని ధియేటర్ల ద్వారానే విడుదల చేయాలి అని భావించినా అతడి తండ్రి సుధాకర రెడ్డి మాత్రం ఈమూవీకి సంబంధించి ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థతో దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నట్లు టాక్.
ఇప్పటికే ఈ మూవీ శాటిలైట్ డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ ఛానల్ 13.5 కోట్లకు కొనడానికి ముందుకు వచ్చింది అని అంటున్నారు. ఈ డీల్ ఇలా కొనసాగుతూ ఉండగానే ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ ఈ మూవీని 28 కోట్లకు కొనడానికి ఆశక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నితిన్ తండ్రి మాత్రం 31 కోట్ల భేరం పై ఫిక్స్ అయి ఉండటంతో అటుఇటుగా ఈ డీల్ సెటిల్ అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. వాస్తవానికి ఈ మూవీని కూడ దసరా రేస్ లో దింపాలని భావించారు. అయితే ఈసారి దసరా కు అనేక పెద్ద సినిమాలు వస్తూ ఉండటంతో పాటు ఆతరువాత కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అన్న ప్రచారం జరుగుతూ ఉండటంతో నితిన్ తండ్రి ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు టాక్..