థియేటర్లు తెరిచినా పూర్వ వైభవం వచ్చేనా ?

VAMSI
గత రెండు సంవత్సరాలుగా ప్రపంచమంతా కరోనా జపమే చేస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా మానవ జీవితాల్లోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి అల్లకల్లోలాన్ని సృష్టించింది. దీని బారిన పడి నష్టపోయిన కుటుంబాలు ఎన్నో చెప్పలేము. రెండు సంవత్సరాల నుండి కరోనా వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త చక్కబెడుతున్నాయి. భారతదేశంలో కరోనా ప్రభావం ఉన్న అన్ని రాష్ట్రాలలో కట్టు దిట్టంగా లాక్ డౌన్ నియమ నిబంధనలను పాటించడంతో, క్రమ క్రమంగా కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. దీనితో లాక్ డౌన్ నిబంధనలను కొన్ని చోట్ల పూర్తిగా ఎత్తివేయగా, మరి కొన్ని చోట్ల సడలింపులతో కొనసాగిస్తున్నారు.

దీనితో తెలుగు సినీ పరిశ్రమకు కాస్త ఊపిరి వచ్చినట్లయింది. కరోనాకు ముందు నిలిపివేసిన షూటింగ్ లను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ప్రశ్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ యాజమాన్యాల  మనసులో మెదులుతూ ఉంటుంది. ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయిన సినిమాలన్నీ పూర్తయిన తరువాత థియేటర్ లో విడుదల చేస్తే ఎప్పటి లాగే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా ? ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇదే విధంగా లాక్ డౌన్ తరువాత సినిమాలు థియేటర్లలో విడుదల అయితే ప్రేక్షకులు బాగానే వచ్చారు.

కానీ ఆ తర్వాత సెకండ్ వేవ్ పేరుతో కరోనా రావడంతో, సగటు మానవుడు లాక్ డౌన్ తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని ఆలోచించాడు.  ఈ సందర్భంలో ప్రజలు పూర్వములాగే థియేటర్లకు తండోపతండాలుగా వచ్చి సినిమాలను అదరిస్తారా అన్న ఆలోచనలో పడ్డారు. లేదా కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రతగా థియేటర్ లకు రాకుండా ఉంటారా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో ప్రేక్షకులు ఈ విధమైన తీర్పును ఇవ్వనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: