నటి కె.ఆర్.విజయ కూతురు ఎవరో తెలుసా..?
తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను గెలుచుకున్న తెలుగు నటి కె.ఆర్. విజయ. ఈమెకు సంబంధించిన వాళ్ళు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరని అనుకుంటుంటారు. కానీ తన కూతురు, చెల్లెలు వంటి వారు కూడా సినీ ఇండస్ట్రీలో కీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వారు ఎవరు..? ఏ సినిమాలో నటించారు..? అన్న విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
పలురకాల సినిమాలలో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కె.ఆర్.విజయ, ఈమెకు మొత్తం నలుగురు చెల్లెళ్ళు కాగా, అందులోనూ ఒక చెల్లెలు కె.ఆర్ సావిత్రి కూడా మలయాళం సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వీరి తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకున్నారు. తన తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. తల్లి కేరళ రాష్ట్రానికి చెందిన వారు.
ఇక కె.ఆర్.విజయ కూతురు "అనూష"కూడా నటే, ఈమె తన పదమూడేళ్ల వయసులోనే మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ వయసులోనే తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అలా అక్కడ సూపర్ హిట్ సినిమాలలో నటించి తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అంతేకాకుండా తను బుల్లితెరపై కూడా ఎన్నో నాటిక లో కనిపించింది.
నటుడు రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన చిత్రం గోల్మాల్ గోవిందం అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి తదితర సినిమాలలో నటించి, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయినప్పటికీ టాలీవుడ్ లో పెద్దగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కానీ మలయాళంలో మాత్రం ఈమెకు తిరుగు లేదని చెప్పవచ్చు. ఇక రాను రాను సినిమా అవకాశాలూ తగ్గిపోతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తెలుగు సీరియల్స్ లో నటించడానికి సిద్ధమైంది అనూష.
ఈమె గృహ లక్ష్మి, నిన్నే పెళ్ళాడుతా, జయం వంటి పలు సీరియల్ లలో నటించింది. కానీ సినీ ఇండస్ట్రీలో ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా నటిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది హీరోయిన్ అనూష.