నిహారిక కొణిదెల.. మెగా ఫ్యామిలీ గారాలపట్టి నిహారిక. ఈమె మొదట బుల్లితెర పైన యాంకర్ గా వ్యవహరిస్తూ ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్ గాసినిమాలలో నటించింది. అయితే ఇప్పటి వరకు ఈమె తెలుగులో కేవలం మూడు చిత్రాలనే చేసింది . ఒక మనసు , హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల ద్వారా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక కేవలం వెండితెరపై సినిమాలలో నటి మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ లో కూడా నటించి, నిర్మించింది. 2016లో ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ లో నటించగా దానికి నిర్మాతగా కూడా వ్యవహరించింది.
ఇక అంతే కాదు 2018 లో వచ్చిన నాన్న కూచి , 2019 లో వచ్చిన మ్యాట్ హౌస్ వంటి వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇక అంతే కాదు "పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్" అనే ఒక చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఇది సొంత వెబ్ సిరీస్ కోసం నిర్మించిందని సమాచారం. నిహారిక సినీ ఇండస్ట్రీ లోకి రాక ముందు మొదట దూరదర్శన్ లో వ్యాఖ్యాతగా పనిచేసి , ఆ తర్వాత ఈటీవీలో ఢీ జూనియర్ వన్, అలాగే ఢీ జూనియర్ 2 షో లకు యాంకర్ గా వ్యవహరించింది. ఇక సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత ఇటీవల చారిత్రాత్మక యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది.
ఇక పోయిన సంవత్సరం 2020 డిసెంబర్ 9వ తేదీన ఉదయపూర్ లో చైతన్య జొన్నలగడ్డ తో వివాహం జరిగింది. ఇక ఈమె వివాహం జరిగిన తర్వాత అంతకు ముందు దాదాపు నెల రోజుల వరకు ఈమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవల ఈమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్ లు చాలా ముద్దుగా ,బొద్దుగా నిహారిక ఉందంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే మరి నిహారిక కి సంబంధించిన తన చిన్ననాటి ఫోటోలను మీరు కూడా ఒక లుక్కేయండి.