అలీ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్..!!
అలీ తన సినీ జీవితంలోనే తొలిసారి నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక స్వయంగా అలీ నిర్మాతగా మారి ఒక సినిమాను విడుదల చేతియబోతున్నారంట. అయితే ఆ సినిమాకి ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే టైటిల్ పెట్టారు. అయితే అలీ మలయాళంలో మంచి విజయం సాధించిన ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సొంత ప్రొడక్షన్ అలీవూడ్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మింస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది.
ఈ సినిమాలో అలీతో పాటు సీనియర్ యాక్టర్ నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం అలీ ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను రంగంలోకి దింపాడు. అలీకి ప్రభాస్ తో మంచిది అనుబంధం ఉంది. వీరిద్దరూ బిల్లా సినిమాలో స్నేహితులుగా నటించారు. అయితే ఇప్పుడు అలీ ప్రభాస్ సాయం తీసుకున్నారు. ఇది సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను చేయబోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. జూన్ 25 సాయంత్ర 4:05కు ఈ పాటను ప్రభాస్ విడుదల చేశారు. ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ ఈ సినిమాతో నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి మరి.