సోషల్ మీడియాని హీటెక్కించిన పూజా హెగ్దే..!
ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథం సినిమాలో అమ్మడు బికినితో కనిపించిందో అప్పుడే అమ్మడికి ఆడియెన్స్ లాక్ అయ్యిపోయారు. అమ్మడు చేస్తున్న అందాల విందుకి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. డీజే సినిమా నుండి వరుస స్టార్ ఛాన్సులతో పూజా హెగ్దే చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలే కాదు అంతకుమించి అన్నట్టుగా సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ ఉంటుంది. తన గ్లామర్ షోతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సాధిస్తుంది పూజా హెగ్దే.
ఇక ప్రస్తుతం అమ్మడు ప్రభాస్ తో రాధే శ్యాం సినిమా చేస్తుంది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా కూడా నటించింది. అఖిల్ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. ప్రభాస్ సినిమాను మాత్రం త్వరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమాల రిలీజ్ లు అన్ని వాయిదా పడ్డాయి లేకపోతే రాధే శ్యాం ఈపాటికి రిలీజ్ అవ్వాల్సింది. సినిమా లాస్ట్ షెడ్యూల్ లేటెస్ట్ గా మొదలైంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాల తర్వాత త్రివిక్రం, మహేష్ సినిమాలో అమ్మడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు మరో స్టార్ సినిమా కూడా డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. ఓ పక్క తమిళంలో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటిస్తుంది పూజా హెగ్దే.