టాలీవుడ్ లో హ్యాట్రిక్ హీరో ఉదయ్ కిరణ్..!

NAGARJUNA NAKKA
టాలీవుడ్ లో ప్రేమకథా చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్.. 1980వ సంవత్సరం హైదరాబాద్ లో జన్మించాడు. కేవీ పికేట్ లో స్కూల్ విద్యను పూర్తి చేశాడు. తర్వాత వెస్లీ కాలేజ్ లో బీకాం చదువుకున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్.
తేజ దర్శకత్వంతో వచ్చిన చిత్రం సినిమాలో నటించి యూత్ లో గిలిగింతలు పెట్టాడు ఉదయ్ కిరణ్. దర్శకుడు తేజ చిత్రం సినిమాలో మరో యువకుడిని హీరోగా అనుకున్నాడు. ఆ కుర్రాడు కుదరదు అనే సరికి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉన్న ఉదయ్ కిరణ్ ను తీసుకున్నాడు. చిత్రం సినిమా బడ్జెట్ 30లక్షల రూపాయలు. 31రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. సినిమా ఊహించిన దానికంటే బాగా పండి.. హిట్ క్రియేట్ చేయడంతో వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. చిత్రం సనిమాకు దర్శకత్వం వహించినందుకు తేజకు.. హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ కు, హీరోయిన్ రీమాసేన్ కు రామోజీరావు తలా 11వేల రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఆ ఉత్సాహంతోనే నువ్వునేను చిత్రం తీసి మరో హిస్టరీ క్రియేట్ చేశాడు తేజ. అప్పట్లో 11వేల రూపాయల రెమ్యునరేషన్ తో మొదలైన ఉదయ్ కిరణ్ సినీ జీవితం కోట్ల రూపాయలు తీసుకునే స్థాయికి చేరింది.
ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వినూత్నంగా ప్రేమ కథా చిత్రంతో వచ్చిన ఈ మూవీ యూత్ కు తెగ నచ్చేసింది. ఆ చిత్రంలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి.  శ్రీరామ్, నీ స్నేహం, కలుసుకోవాలని లాంటి సినిమాలు ఉదయ్ కిరణ్ కు మంచి పేరు తీసుకొచ్చిపెట్టాయి.
కలుసుకోవాలని చిత్రంలో డ్యాన్స్ లో వైవిధ్యాన్నిప్రదర్శించాడు ఉదయ్ కిరణ్. ఇక శ్రీరామ్ సినిమాలో నటనలో ప్రత్యేకతను చాటుకున్నాడు. తర్వాత ఆయన్ను కొన్ని ఫ్లాపులు వెంటాడాయి. ఆ తర్వాత 2005లో కోలీవుడ్ లో ప్రవేశించిన ఉదయ్ కిరణ్..  బాలచందర్ దర్శకత్వంలో పాయ్ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత మరో వంబు సందై, పెన్ సింగం లాంటి చిత్రాల్లో యాక్ట్ చేసి.. తమిళులకు తెలుగోడి టాలెంట్ చూపించాడు. ఉదయ్ కిరణ్ కు హ్యాట్రిక్ హీరో అనే బిరుదు కూడా పేరుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: