పవన్ దాతృత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..?

frame పవన్ దాతృత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..?

Suma Kallamadi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతుంటారు. ఆయనకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వారిలో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతుంటారు. అయితే పవన్ ఎవరికీ తెలియకుండా దానాలు చేస్తారు. ఒకసారి ఖమ్మం జిల్లాలోని ఓ వృద్ధాశ్రమానికి చెందిన ఒక మహిళ హైదరాబాద్ కి వచ్చి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు నిల్చున్నారట. అయితే ఆమెను చూసిన పవన్ తన ఇంటి నుంచి బయటికి వచ్చి ఆమెను పలకరించారట. అప్పటికే భారీ వర్షం కురుస్తుండగా.. పవన్ తన కారులో ఆ మహిళను కూర్చోబెట్టి హీటర్ ఆన్ చేశారట. నేను మీకు కొడుకులాంటి వాణ్ని.. మీకు వచ్చిన కష్టం ఏంటో నాకు చెప్పండి.. నేను సహాయం చేస్తానని పవన్ కళ్యాణ్ అనడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారట.

ఒక పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా ఏమాత్రం అహం చూపించకుండా సొంత కొడుకులా తనకు దగ్గరుండి మరి భోజనం పెట్టించారట. అలాగే ఆమె ఓల్డ్ ఏజ్ హౌస్ కి లక్ష రూపాయలు విరాళం ఇచ్చి.. ఆమెకు 10 వేల రూపాయలు నగదు రూపంలో అందజేశారట. ఈ విషయాన్ని ఆమె మీడియాతో వెల్లడించారు. నిజానికి పవన్ ఇలాంటివి ఎన్నో చేసారు కానీ వాటిలో చాలా వరకు వెలుగులోకి రాలేదు.


2018లో చెన్నై వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయలు దానం చేశారు. హుద్‌హుద్ తుఫాను బాధితులకు 50 లక్షల రూపాయలు దానం చేశారు. ప్రాణాంతకమైన రోగాలతో బాధ పడుతున్న ప్రజలకు ఆయన ఆర్థిక సహాయం చేశారు. పవన్ దయవల్ల తమ ప్రాణాలను కాపాడుకున్న వారెందరో ఉన్నారు. రవి అనే ఒక అసిస్టెంట్ కెమెరామెన్ భార్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా.. ఆమె గుండె ఆపరేషన్ కి పవన్ కళ్యాణ్ 25 లక్షల రూపాయలు డొనేట్ చేశారు.


ప్రతిభావంతులైన క్రీడాకారులకు కూడా ఆయన లక్షల రూపాయల్లో దానాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా లోని మూడు గ్రామాలలో నీటి కొరత ఉందని తెలుసుకున్న పవన్ తన సొంత డబ్బులతో బోర్ వెల్స్ వేయించారు. ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సిఎమ్‌పిఎఫ్) ట్రస్ట్ స్థాపించి ఎప్పటినుంచో సమాజ సేవ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: