ఆదిపురుష్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జంటగా నటిస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్ యొక్క ఫ్యాషన్ స్టయిల్ మిగతా హీరోయిన్ల అందరికీ చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె ఫ్యాషన్ స్టయిల్ ఫ్యాన్స్, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్లాయిడ్ ప్యాంటు, లేత ఎరుపు రంగు టీ షర్ట్ ధరించి కెమెరాకు చిక్కారు. ఆ సమయంలోనే ఆమె ముంబయిలోని బాంద్రాలో ఒక క్లినిక్ కి వెళ్లి టీకా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ధరించిన మాస్క్ పై కూడా 'వ్యాక్సివేటెడ్' అని రాసి ఉండటం గమనించవచ్చు.
అయితే ఆమె ఈ డ్రస్ లో చాలా ఆకర్షణీయంగా కనిపించారు. క్లినిక్ వెలుపల మెరిసిన ఈ తార బ్లాక్ అండ్ వైట్ కలర్ షర్టు తన భుజాలపై వేసుకొని కనిపించారు. అలాగే ఆమె ధరించిన "రివ్ గౌచే" బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ అట్రాక్టివ్ గా నిలిచింది. అయితే దీని విలువ అక్షరాలా ఒక లక్షా 50 వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఒక హ్యాండ్ బ్యాగ్ ధర లక్షన్నర రూపాయలు అంటే సాధారణ విషయమేమీ కాదు. ఈ ఫోటోలలో కృతిసనన్ తన జుట్టును ఫ్రీ గా వదిలేసారు. అలాగే సన్‌గ్లాసెస్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపించారు. స్లిమ్ గా ఉండే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తనకు సరిగ్గా సూట్ అయ్యే డ్రెస్సులను ఎంపిక చేసుకుంటుంటారు.
ఇకపోతే కృతిసనన్ టైగర్ ష్రాఫ్ తో కలిసి గణపత్ అనే ఒక అవుట్-అవుట్-యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కృతిసనన్ రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేయాల్సి ఉంది. దీంతో ఆమె ప్రస్తుతం జిమ్ లో కఠినమైన వర్కౌట్ చేస్తూ తన ఫిట్నెస్ పెంచుకుంటున్నారు. అలాగే తనకు సంబంధించిన వర్కౌట్స్ వీడియోలు నెట్టింట షేర్ చేస్తూ అభిమానుల్లో ఫిట్నెస్ గోల్స్ పెంచుతున్నారు.