కత్తి మహేష్.. బిగ్ బాస్ తరువాత ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరంలేదు. బిగ్ బాస్ కి ముందు కత్తి మహేష్ అంటే అందరికి తెలిసే వారు కారు. కాని బిగ్ బాస్ ద్వారా కత్తి మహేష్ కు మంచి పేరు వచ్చింది. అయితే కత్తి మహేష్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటారు. కాగా తాజాగా కత్తి మహేష్ కు ఘోర రోడ్లు ప్రమాదం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితిలో కూడా కొంత మంది మానవత్వం లేకుండా సెటైర్లు కురిపిస్తున్నారు. అలా కత్తి మహేశ్ పై ఇప్పుడు నటి పూనమ్ కౌర్ కూడా సెటైర్లు వేసింది. ఒకప్పుడు కత్తి మహేష్, పవన్ కళ్యాణ్, పూనం కౌర్ వ్యవహారం మీడియాలో ఎంతటి రచ్చ చేసిందో తెలియని విషయం కాదు.
దాంతో పూనమ్ ఇప్పుడు కత్తిపై సోషల్ మీడియా వేధికగా విమర్శలు చేసింది. వివరాల్లోకి వెళితే.... కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై కత్తి మహేశ్ కు రోడ్డు ప్రమాదం జరింగింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కత్తి మహేశ్ ను కారు నుండి భయటకు తీసి వెంటనే నెల్లూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కత్తి మహేష్ కారు పూర్తిగా ధ్వసం అయ్యింది. అంతే కాకుండా ఆయన కూడా స్పృహ కోల్పోయారు.
అయితే దీనిపై పూనం కౌర్ సోషల్ మీడియా వేధికగా సెటైర్లు వేసింది. నీ స్వార్ధానికి రాముడిని, సీతని వాడుకున్నావ్, వదిలేశావ్ అంటూ పేర్కొంది. ఏళ్ళ తరబడి పద్దతిగా బ్రతుకుతున్న ఒక బ్రాహ్మణ అమ్మాయిని నేను..ఇప్పుడు నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నానంటూ వ్యాఖ్యానించింది. ఎందుకంటే ఇకనైనా నువ్వు జీవితాన్ని చూస్తావని మరియు అమ్మాయిలని అమ్మని గౌరవించడం నేర్చుకో అంటూ ట్వీట్ చేశింది. దీనిపై కొంతమంది పూనమ్ కౌర్ కు సపోర్ట్ చేస్తూ ఉండగా..మరి కొందరు మాత్రం ఇలాంటి సంధర్భంలో సెటైర్లు అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు.