మనకు ఉన్నది రెండు ఆప్షన్లే.. వ్యాక్సిన్ పై నాని లేటెస్ట్ కామెంట్ వైరల్..!

shami
నాచురల్ స్టార్ నాని వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్నట్టు ఉన్నాడు. ఆ పిక్ ను షేర్ చేస్తూ తన సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు నాని. ఇప్పుడు మనకు ఉన్నది రెండు ఆప్షన్లు మాత్రమే వ్యాక్సిన్ తీసుకుని సేఫ్ గా ఉండటం.. సేఫ్ గా ఉండటం కోసం వ్యాక్సిన్ వేసుకోవడం అని ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెప్పి షాక్ ఇచ్చాడు నాని. ఇంతకీ నాని చెప్పదలచుకున్నది ఏంటంటే వ్యాక్సిన్ వేసుకుంటేనే మనం సేఫ్ గా ఉండగలం అందరు వ్యాక్సిన్ వేసుకోండన్నట్టు నాని మెసేజ్ చేశాడు. నాని చేసిన మెసేజ్ కు ఫ్యాన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినీ పరిశ్రమ మీద బాగా పడ్డది. అందుకే సినీ పెద్దలంతా కలిసి స్పెషల్ డ్రైవ్ కింద వ్యాక్సిన్ ప్రక్రియ చేయించారు. ముఖ్యంగా సీసీసీ తరపున మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో తన సపోర్ట్ అందించారు. అపోలో హాస్పిటల్స్ సహకారంతో విడతల వారిగా ఆర్టిస్టులు అందరికి వ్యాక్సిన్ వేయించారు. నాని కూడా లేటెస్ట్ గా వ్యాక్సిన్ తీసుకున్నాడని తెలుస్తుంది. అదే విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నానితో పాటు జగపతి బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాని శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాని కెరియర్ లో ఈ సినిమా హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది.  టక్ జగదీష్, శ్యాం సింగ రాయ్ రెండు సినిమాల మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.  

 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: