ఉదయ్‌ కిరణ్‌ ఆగిపోయిన 10 సినిమాలివే...!!

N.ANJI
తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన సినిమా చిత్రం. ఈ సినిమాతోనే హీరోగా ఉదయ్ కిరణ్, డైరెక్టర్ గా తేజు, హీరోయిన్ గా రీమా సేన్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇండస్ట్రీలో ముగ్గురికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ చిత్రం’, ‘నువ్వు నేను’ ‘ఔన‌న్నా కాద‌న్న’వంటి సూపర్ హిట్ సినిమాలను చిత్రీకరించారు. ఉదయ్ కిరణ్ సినీ జీవితంలో ఆగిపోయిన సినిమాల గురించి ఒక్కసారి చూద్దామా.

ఇక బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో అప్పటి హీరోయిన్‌ సౌంద‌ర్య ప్రధాన పాత్ర‌లో న‌ర్త‌న‌శాల సినిమాను తెరకెక్కించాలనుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే సౌంద‌ర్య ఆకస్మాత్తు మరణంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక ఈ చిత్రంలో అభిమాన్యుడి కోసం ఉద‌య్‌కిర‌ణ్‌ను అనుకున్నారని అప్పట్లో టాక్ వచ్చింది.

అలాగే సూపర్ గుడ్ ఫిలింస్‌ బ్యానర్‌ పై ఉద‌య్ కిర‌ణ్‌, స‌దా జంట‌గా ఓ సినిమాకు తీయాలని అనున్నారంట. అంతేకాదు.. ఈ సినిమాకు లవర్స్ అనే టైటిల్ ని పెట్టారంట. అయితే ఏమైందో తెలియదు కానీ.. ఈ సినిమా పట్టలెక్కలేకపోయింది. ఇక అంజనా ప్రొడక్షన్స్ లో దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్షన్‌లో ఉద‌య్ కిర‌ణ్‌, అసిన్ జంట‌గా ఓ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు.

ప్రత్యూష క్రియేషన్స్ లో ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ఓ సినిమాను చేయాలనీ అనుకున్నారు. అందుకోసం ప్రకటన కూడా ఇచ్చారు.  ఈ సినిమా కూడా అనుకోకుండా ఆగిపోయింది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కూడా ఉద‌య్ కిర‌ణ్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. ఏఎం ర‌త్నం నిర్మాణంలో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ప్రేమంటే సులువు కాదురా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉండగా ఆగిపోయింది.

ఇక ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆదిశంకరాచార్య‌. ఈ చిత్ర సమయానికి  ఉద‌య్ కిర‌ణ్ మార్కెట్ పడిపోవడంతో ఈ సినిమాను స్టాప్ చేశారు. షాహిద్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్ జంట‌గా రూపొందిన బాలీవుడ్ చిత్రం జ‌బ్ వి మిట్ తెలుగులో రీమెక్ చేయాలనుకున్నారు. అందులో ఉదయ్ కిరణ్, త్రిష‌ హీరోహీరోయిన్లుగా చేయడానికి సన్నాహాలు కూడా జరిగాయి. కానీ అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది. ఎంఎస్ రాజుతో ఉదయ్‌ కిరణ్‌ ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అది కూడా ఆగిపోయింది. తేజ ఉదయ్ కిరణ్ తో మరో సినిమాను చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ఉదయ్ చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: