హాట్ టాపిక్ గా మారిన సునీత లేటెస్ట్ స్టిల్ !

Seetha Sailaja
సింగర్ సునీత సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా తాను ఈమధ్య మళ్ళీ పెళ్ళి చేసుకున్న తరువాత ఆమె మరింత యాక్టివ్ గా మారింది. ఒక ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న పిల్లల టాలెంట్ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తూ మళ్ళీ రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటూ ఆమె కెరియర్ వేగాన్ని పెంచింది.

గత సంవత్సరం అందరూ ఆశ్చర్యపోయపడేలా తన  నిశ్చితార్థ వార్త చెప్పి తన ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆతరువాత ఆమె పెళ్లి ఫోటోలు కూడ మీడియాకు వైరల్ గా మారాయి. లేటెస్ట్ గా సునీత మరోసారి సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తన భర్త రామ్ తో కలిసి క్యాండీడ్ పిక్ పోస్ట్ చేసింది. భర్త రామ్ తో సునీత ఏదో మాట్లాడుకుంటున్నట్లు ఈ ఫోటోలో మనకు కనిపిస్తోంది.  చాలరోజుల తర్వాత సునీత ఒక ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటోను నెటిజన్లు విపరీతంగా చూడటమే కాకుండా దానికి విపరీతంగా లైక్స్ కొడుతున్నారు. ముఖ్యంగా పెళ్ళి తరువాత సునీతలో ఆనందంతో పాటు మానసిక ధైర్యం కూడ పెరిగినట్లు కనిపిస్తోంది.
సునీత నాలుగు పదుల వయసు దాటాక వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని ఇష్టపడి పెళ్లాడిన విషయం తెలిసిందే. అవకాశం చిక్కినప్పుడల్లా ఆమె భర్త గురించి చాల గొప్పగా మాట్లాడుతుంది. ఆయనతో మిగిలిన జీవితాన్ని పూర్తి చేస్తానని సునీత చాల ఆనందంగా చెపుతూ ఉంటుంది. సునీత భర్త రామ్ ఆమెకంటే 5 సంవత్సరాలు పెద్దవాడు అని అంటారు. వీరిద్దరూ 50వ పడిలోకి త్వరలో ఎంటర్ అవుతున్నప్పటికీ చాల ఉత్సాహంగా కనిపిస్తూ వీరిద్దరి జోడి అదిరింది అన్న కాంప్లిమెంట్స్ ను అందిపుచ్చుకోవడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న వీరిరువురు ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ గా కొనసాగుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: