తమిళ్ లో మరో క్రేజీ కాంబినేషన్... ఇక తగ్గేదేలే ...

VAMSI
ప్రస్తుత తమిళ్ లో సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న అతి కొద్దిమంది డైరెక్టర్ లలో యువ దర్శకుడు అట్లీకి ప్రత్యేక స్థానముంది. అట్లీ ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దగ్గర రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.  అతి తక్కువ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి తనదైన దర్శకత్వ శైలితో తమిళ ఇండస్ట్రీలో హిట్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఇతను మొదటి సినిమా "రాజా రాణి" తోనే బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టాడు. ఒక అందమైన లవ్ స్టోరీతో ప్రేక్షకులను కవ్వించాడు. ఈ సినిమాలో హీరోలుగా నటించిన జై మరియు ఆర్యన్,  అలాగే హీరోయిన్ లు గా చేసిన నయనతార మరియు నజ్రియా లు తమ పాత్రలకు ప్రాణం పోశారు.
ఆ తరువాత ఇళయ దళపతి విజయ్ తో వరుసగా తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలు తీసి టాప్ డైరెక్టర్ గా కోలీవుడ్ లో పాగా వేశాడు. దీనితో ఆ డైరెక్టర్ పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. అట్లీ ప్రత్యేకత ఏమిటంటే కథను డిస్టర్బ్ చేయకుండానే, హీరో పాత్ర బాగా ఎలివేట్ అయ్యాయేలా జాగ్రత్త పడతాడు. ఒక హీరోని ఎలా ప్రెజెంట్ చెయ్యాలో అట్లీకే తెలుసు. ఆ తరువాత ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరొక్క వార్త తమిళ ప్రేక్షకులకు మంచి జోష్ ని ఇస్తోంది. విభిన్న నటుడిగా పేరున్న సూర్యతో  అట్లీ ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.  


"ఆకాశమే నీ హద్దు" ఇచ్చిన విజయంతో సూర్య మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. అందుకే అట్లీ చెప్పిన ఒక కథను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ సూర్య కు సరిగ్గా సూట్ అవుతుందని అట్లీ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఇక సూర్య ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది. మరి చూద్దాం ఇది నిజమవుతుందా లేదా ...?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: