సినిమా ఇండస్ట్రీ ఒక అద్భుతమని చెప్పాలి. ఎప్పుడు ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలియదు. మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ లేదా హీరో ఒక్కసారిగా ప్లాప్ సినిమాల బాట పట్టొచ్చు. అలాగే ప్లాప్ లతో సతమవుతున్న హీరో లేదా డైరెక్టర్ ఒక్క సినిమాతో వారి రేంజ్ మారిపోవచ్చు. అదే విధంగా అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న కార్తికేయకి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాను అందించాడు డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి. "ఆర్ ఎక్స్ 100 " సినిమాతో ఒక సరికొత్త ప్రేమకథను తెరకెక్కించి అటు కార్తికేయకు మరియు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కార్తికేయ కెరీర్ మంచి ఊపందుకుంది. కానీ కథల ఎంపికలో పొరపాట్లు చేసి చేతులు కాల్చుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజయ్ భూపతి "మహాసముద్రం" సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తన సినిమా కెరీర్ కి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి కోసం కార్తికేయ ఈ సినిమాలో ఒక 10 నిముషాల రోల్ చేయనున్నారని సినిమా వర్గాల నుండి అందుతోన్న సమాచారం. ఇలా డైరెక్టర్ ల కోసం హీరోలు స్పెషల్ రోల్స్ చేయడం కొత్తేమి కాదు. ఇందులో కార్తికేయ పాత్ర సినిమా విజయానికి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇందులో వాస్తవమెంతున్నా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం కరోనా నుండి కోలుకుంటున్న వేళ వీలైనంత త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్దార్ధ్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.