"ఎఫ్ 3" మూవీ నుండి షాకింగ్ న్యూస్ ?
ఈ ప్రపోజల్ ని నిర్మాత దిల్ రాజు వద్దకు తీసుకెళ్లగా మొదట కాస్త ఆలోచించినా...తర్వాత పాత్ర అవసరం అనిపించి, అంతే కాకుండా డైరెక్టర్ మాట కాదనలేక ఓకే చెప్పారట నిర్మాత.
ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కనిపించేలా దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేసినట్టు వినికిడి. సినీ వర్గాల సమాచారం మేరకు ఇది నిజమే అని తెలుస్తోంది. అయితే పాత్ర ఎలా ఉండబోతుంది అన్న విషయంపై ఇంకా ఏ న్యూస్ రాలేదు.
"ఎఫ్ 2" ఘన విజయం అందుకున్న నేపథ్యంలో, దీనికి సీక్వెల్ గా "ఎఫ్ 3" ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు తాజాగా హీరో గోపి చంద్ పేరు కూడా యాడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. హిందీ గోల్ మాల్ మూవీ తరహాలో ఎఫ్ 2 చిత్రానికి కూడా వరుస సీక్వెల్ తీసి ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలన్న ఆలోచనతో ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి మంచి స్పీడ్ మీద ఉన్నారు.