మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో తప్పక చూడాల్సిన టాప్ 10 సినిమాలు ఇవే..!!

Anilkumar
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన సొంత టాలెంట్ తో ఇండ్రస్టీ లో అడుగుపెట్టి..ఆపై అంచెలంచెలుగా ఎదిగి అగ్ర హీరో స్థాయికి చేరుకొని మెగాస్టార్ గా కొన్ని కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.దాదాపు 40 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో 150 కి పైగా సినిమాలు చేసాడు చిరు.అయితే చిరూ నటించిన సినిమాల్లో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే టాప్ 10 సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

#10.ఖైదీ నంబర్786

1988లో విడుదలైన ఈ సినిమాకి బాపినీడు దర్శకత్వం వహించారు.ముఖ్యంగా సినిమాలో పాటలు, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలవడంతో అప్పట్లో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది ఈ సినిమా.

#9.చంటబ్బాయి

చిరంజీవి కామెడీ పాత్రలలో కూడా రాణించగలడని నిరూపించిన సినిమా చంటబ్బాయి. సినిమాలో చిరు డిటెక్టివ్ పాత్రలో మంచి నటనకు కనబర్చాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

#8.ఛాలెంజ్

ఓ నిరుద్యోగ యువకుడు ధనవంతుడ్ని సవాల్ చేసే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాబ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా పలు ప్రశంసలు పొందింది.

#7.స్వయం కృషి

చిరంజీవికి అనేక అవార్డులను తెచ్చిపెట్టిన సినిమా ఇది.ఈ సినిమాలో చిరూ నటనకి ఆడియన్సే కాదు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పలు కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుంది.

#6.రుద్రవీణ

కె.బాలచందర్, చిరంజీవి కలయికలో వచ్చిన ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా రూపొంది.. సమాజంలో సాంప్రదాయ పద్ధతులకు స్ఫూర్తినిచ్చింది.

#5.ఖైదీ

చిరంజీవిని ఓవర్ నైట్ స్టార్ ని చేసిన సినిమా ఖైదీ.కోదండరామి రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పుట్లో సంచలన విజయం సాధించి..చిరంజీవి క్రేజ్ ని డబుల్ చేసింది.

#4.ఠాగూర్

చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఠాగూర్ మొదటి స్థానంలో ఉంటుంది.వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి..191 కేంద్రాల్లో ఏకంగా 100 రోజులు ఆడింది.

#3.ఇంద్ర

చిరూ కెరీర్లో అతి పెద్ద విజయాలలో ఇంద్ర కూడా ఒకటి.రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో చిరంజీవి 6వ ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

#2.గ్యాంగ్ లీడర్

ఈ సినిమాతోయూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు చిరూ.విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించి.. హిందీలో కూడా రీమేక్ అయ్యింది.

#1.జగదేక వీరుడు అతిలోక సుందరి

దర్శకుడు రాఘవేంద్రరావు తెరక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది.సినిమాలో చిరంజీవి విన్యాసాలు, శ్రీదేవి  అందాలు, అమ్రిష్ పూరి విలనిజం..ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అప్పట్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన్న ఈ సినిమా ఒకే థియేటర్ లో ఏకంగా 200 రోజులు ప్రదర్శింపబడింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: