పవన్ కు ఏమాత్రం తగ్గని రానా..!

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం కు రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. మళయాళంలో పృధ్విరాజ్ సుకుమారన్, బిజుమీనన్ నటించిన ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్నారు. పృధ్విరాజ్ పాత్రలో రానా నటిస్తుండగా బిజు మీనన్ పాత్రలో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రం అందిస్తున్నారు. డైరక్షన్ మాత్రం సాగర్ చంద్ర చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంటే కాన్సెంట్రేషన్ అంతా ఆయన మీదే ఉంటుంది. కాని ఏకే రీమేక్ లో పవన్ తో పాటు రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సినిమాలో పవన్ కు ఈక్వల్ గా రానా పాత్ర ఉంటుందట. ఎక్కడ రానాని తగ్గించే విధంగా చూపించరని అంటున్నారు. ఇంకా సినిమాలో పవన్ పాత్రే తగ్గి ఉంటుంది. సినిమాలో పవన్ ఓ పోలీస్ పాత్రలో నటిస్తుండగా రానా ఓ సెలబ్రిటీగా నటిస్తున్నారు.
సినిమాలో రానా పాత్ర చాలా బాగా వస్తుందని అంటున్నారు. సినిమా పూర్తయినంత వరకు రష్ చూసి చిత్రయూనిట్ సినిమా పక్కా హిట్ అనేస్తున్నారు. తప్పకుండా పవన్, క్రిష్ ల కాంబో ఆడియెన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుందని చెబుతున్నారు. సినిమాలో ఐశ్వర్యా రాజేష్, నియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. పవన్ తో రానా ఏమాత్రం తగ్గకుండా సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. తన పాత్రతో పాటుగా రానా పాత్ర కూడా బాగా వస్తుందా అని పవన్ కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ డైరక్షన్ లో పవన్ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా కూడా సెట్స్ మీద ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: