ఫ్లాప్ లు వస్తున్నా బాలయ్య తీరు మారదేంటి?
ప్రస్తుతం ఆయనకు అచ్చోచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా, ఇటీవల వచ్చిన ఈ పాత్రలకు సంబంధించిన టీజర్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా తమన్ సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ హిట్ దర్శకుడి ని లైన్లో పెట్టు కున్నారు. ఆయనే రవితేజతో క్రాక్ సినిమా ద్వారా హిట్లు అందుకున్న గోపీచంద్ మలినేని. ఆయన దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలకృష్ణ తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు.
ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఆయన వరుస ప్లాప్, ఫేడ్ అవుట్ దర్శకులను ఎంచుకోవడం బాలయ్య అభిమానులు కలవరపరుస్తోంది. పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ అనే భారీ ప్లాప్ చిత్రాన్నిబాలకృష్ణ చేయగా మళ్లీ ఆయనతో మరో సినిమా ప్లాన్ చేశాడు. అలాగే బాలకృష్ణకు మాస్ హిట్ చిత్రాలను అందించిన బి.గోపాల్ ఇప్పుడు ఫామ్ లో లేదు ఆయనకు అవకాశం ఇస్తున్నాడట బాలకృష్ణ. అలాగే డిక్టేటర్ లాంటి ప్లాప్ చిత్రాన్ని అందించిన శ్రీవాస్ దర్శకుడిగా ఓ సినిమా చేయబోతున్నారట బాలకృష్ణ. గోపీచంద్ మలినేని లాంటి హిట్ దర్శకుడి తర్వాత ఇలాంటి దర్శకులతో సినిమాలు చేసి బాలకృష్ణ ఇలాంటి విజయాలను సాధిస్తారో చూడాలి.