రష్మిక మందన సిగరెట్ కహనీ..!

NAGARJUNA NAKKA
హీరో, హీరోయిన్ లు సోషల్ మీడియాతో రకరకాల ఇబ్బందుల ఎదుర్కొంటుంటారు. ఎపుడైనా లైవ్ చాట్ కు వచ్చిన సందర్భంలో పిచ్చిపిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి ప్రశ్నలకు కొందరు సరైన సమాధానం ఇస్తే.. మరికొందరు గట్టిగా ఆన్సర్ ఇస్తారు. ఇంకొందరు అసహనం కోల్పోయి సోషల్ మీడియా ప్రతినిధులపై మండిపడతారు.

ఇంకొందరు ఫన్నీ కామెంట్స్ తో సంతోషపెడతారు. ఇంకొందరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. రష్మిక కూడా అలాంటి సిట్యువేష్ నే ఎదుర్కొంది. ఇటీవల షూటింగ్ లు లేక ఖాళీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. అందులో భాగంగానే లైవ్ చాట్ లో పాల్గొంది. సోషల్ మీడియా మిత్రులు అడిగన ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది.

ఇటీవల ఒక వ్యక్తి రష్మికను వింత ప్రశ్న అడిగాడు. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతావు అని అడిగాడు. అందుకు ఆమె సింపుల్ గా జవాబిచ్చింది. తాను ఎప్పుడూ సిగరెట్ తాగలేదని.. ఇకపై కూడా తాగనని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తన చుట్టుపక్కల ఉన్నవాళ్లు పొగతాగినా తనకు నచ్చదని చెప్పుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే సగరెట్ తాగేవాళ్లంటే అసహ్యమనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా మందికి సిగరెట్ అలవాటుంటుంది. ఆ ఉద్దేశంతోన ఇలాంటి సిల్లీ ప్రశ్న వేసి.. రష్మిక నుండి ఆ సమాధానాన్ని పొందాడు ఆ వ్యక్తి.

రష్మిక మందన ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అంతేకాదు తన మాతృభాష కన్నడలో కూడా నటిస్తోంది. దక్షిణాదిన పెద్ద ఎత్తు పారితోషికం తీసుకుంటున్న రష్మిక మందన తనదైన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ అన్ని రకాల ఆడియన్స్ ను థియేటర్ల వైపు తిప్పుకుంటోంది.ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: