సంపూర్ణేష్ బాబు చేసిన పనికి షాక్ లో నెటిజన్లు..?

Divya
టాలీవుడ్ లో ఎంతో మంది పెద్ద సెలబ్రెటీలు ఉన్నా, అందులో కొందరు మాత్రమే ప్రజల సేవకై పరితపిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం తమకు ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా ఉంటారు. మరి కొంత మంది మాత్రం వారికి తోచిన విధంగా పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు.అలాంటివారిలో సంపూర్ణేష్ బాబు కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో సంపూర్ణేష్ బాబు కూడా తనదైన శైలిలో పేద ప్రజలకు ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా తనకు తోచిన సహాయాని చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఆ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెండితెరపై తక్కువ సినిమాలతోనే ఎక్కువ  పాపులారిటీ సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్ బాబు. తను నటించిన మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. అంతే కాకుండా తన సినిమాతో సమాజంలో ప్రజలు పడుతున్న కష్టాలను కూడా తనదైన శైలిలో కామెడీ రూపంలో చూపిస్తూనే ఉంటాడు సంపూర్ణేష్ బాబు.
తాజాగా తెలంగాణలోని దుబ్బాక అనే ప్రాంతానికి చెందిన నరసింహాచారి దంపతులు అప్పులు ఎక్కువ అవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఇలా చేయడంతో వీరి పిల్లలు అనాధలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు వెంటనే వీరికి ఆర్థిక సాయం కింద 25,000 రూపాయలను అందించారు. అంతే కాకుండా ఇద్దరు పిల్లలు చదువుకు అయ్యే  ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఒక సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
"మా నిర్మాత సాయి రాజేష్ తో కలిసి, ఈ సహాయాన్ని అందించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ వరదలు వచ్చినప్పుడు కూడా, ఈ హీరో తన వంతు సహాయంగా ఎంతో కొంత అందించాడు. ఇక కొద్ది రోజుల కిందట చనిపోయిన  జర్నలిస్ట్ కి కూడ 50,000 రూపాయలను అందించాడు. ఇలా ఇన్ని సహాయాలు చేసిన సంపూని ప్రేక్షకులు ఎంతో అభినందిస్తున్నారు. తను ఒక చిన్న హీరో అయినా కూడా ఇంతలా సహాయం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతే కాకుండా సంపూర్ణేష్ బాబు మూడు సినిమాల్లో నటిస్తున్నారు.

ఈయన నటిస్తున్న సినిమాలు విజయవంతమై ఎంతో మందికి సహాయం చేయాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: