రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఒక బయోపిక్ లో శ్రీరాముడి పాత్రలో మహేష్ నటించనున్నారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సినిమా అభిమానులు ఒక హాట్ డిస్కషన్ కి తెరలేపారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్' లో శ్రీరాముడి పాత్ర చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నిజానికి టాలీవుడ్ నిర్మాత మధు మంతెన, దర్శకుడు నితీష్ తివారి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి 2017వ సంవత్సరంలో రామాయణం పై ఒక సినిమా ప్రకటించారు. దీనితో అభిమానులు అప్పట్లో చాలా ఎక్సైట్ అయ్యారు. కానీ నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్నా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు.
ఐతే సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, హృతిక్ రోషన్ హీరోగా నటించనున్నారని.. సీతగా దీపికా పదుకొణె నటించనున్నారని వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు మహేష్ బాబు పేరు వినిపిస్తోంది. దీంతో అభిమానులు అప్పుడే ప్రభాస్ సినిమాని ప్రస్తావిస్తూ మహేష్ బాబు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు సూపర్ గా ఉంటారని.. ప్రభాస్ ని మించి ఆయన గుర్తింపు దక్కించుకుంటారని మహేష్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సినిమాలో రాజు పాత్ర చేసి భారత దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారని.. ఆయన కట్ ఔట్ ఏ పాత్రకైనా సరిగ్గా సెట్ అవుతుందని.. మహేష్ బాబు ప్రభాస్ కి పోటీగా నిలబడలేరని అభిప్రాయపడుతున్నారు. అయితే మహేష్ బాబుని రాముని పాత్ర కోసం మూవీ యూనిట్ సంప్రదించిందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళిలతో కలసి రెండు సినిమాలు వరుసగా చేయనున్నారు. ఒకవేళ ఆయన ఈ పౌరాణిక ప్రాజెక్ట్ కి ఒప్పుకుంటే.. 2-3 సంవత్సరాల తర్వాత ఆ సినిమాని ప్రారంభించే అవకాశం ఉంది.