ప్రియాంక ఒక్క పోస్ట్ 3 కోట్లు రెమ్యునరేషన్..!
ఈ లిస్ట్ లో కొహ్లి 19వ స్థానంలో నిలిచాడు. అయితే ఆ స్థానంలో ఉండి కూడా కొహ్లి బాగానే సంపాదిస్తున్నాడు. ఇక ఈ లిస్ట్ లో ప్రియాంకా చోప్రా 27వ స్థానంలో ఉంది. అమ్మడు కూడా ఇన్ స్టాగ్రాం లో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది. ఈ అమ్మడు పెట్టే ఒక్కో పోస్ట్ కు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. అయితే హెచ్ పర్ క్యూ సంస్థ 2021 లిస్ట్ లో 395 మంది సెలబ్రిటీల్లో కొహ్లి, ప్రియాంకా చోప్రా మాత్రమే ఉండటం విశేషం.
ఇక ఈ లిస్ట్ లో క్రిస్టియానో రొనాల్డో టాప్ 1 గా నిలిచాడు. వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఈ ప్లేయర్ ఒక్క పోస్ట్ కు 11.9 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నాడు. రొనాల్డో తర్వాత సెకండ్ ప్లేస్ లో హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ ఉన్నారు. మొత్తానికి ప్రియాంకా ఒక్క పోస్ట్ తో 3 కోట్ల రెమ్యునరేషన్ తో అందరికి షాక్ ఇచ్చింది. హాలీవుడ్ కి వెళ్లాక ఇక్కడ సినిమాలను పూర్తిగా మర్చిపోయిన అమ్మడు మళ్లీ బాలీవ్డ్ సినిమాల్లో నటించాలని అనుకుంటుందని తెలుస్తుంది.