రచ్చ బ్యాచ్ తో క్రేజీ ప్రాజెక్ట్ ...

VAMSI
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అరియానా, హరిక, దివి, సోహెల్, మోనాల్ గజ్జర్ ఇలా వీరందరూ బిగ్ బాస్ తర్వాత పెద్ద సెలెబ్రెటీలుగా మారిపొయారు. బిగ్ బాస్ లో వీరు నడుచుకున్న వైఖరి వీరికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే హౌస్ నుండి బయటకొచ్చాక అందరూ అవకాశాలు అందుకుని ఏదో ఒక షో లో బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోని కొందరు కంటెస్టెంట్స్ కలిసి ఒకే వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో అభిజిత్, మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్రల్లో కనిపించనుండగా యాంకర్ లాస్య, అరియానా, హారిక, సుజాత, ముక్కు అవినాష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.

ఒక రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్  కాబోతుందట. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి చర్చలు జరిగాయని, కరోనా ముప్పు  తగ్గింది అనే వార్త వినిపించగానే ఈ వెబ్ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు అంటున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం బిగ్ బాస్ సీజన్ ఫోర్ సెలబ్రిటీస్ పారితోషకం భారీగానే డిమాండ్ చేశారని, వారి వారి క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా అభిజిత్, మోనాల్ లు భారీ మొత్తంలో అందుకోగా.. ఆ తర్వాత హై రెమ్యూనరేషన్ ముక్కు అవినాష్ కేనని తెలుస్తోంది.

ఇక వీరంతా ఒకే వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు అంటే అభిమానుల ఆనందానికి అవధులు లేవు. లవ్, కామెడి, ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ ని కలగలిపి ప్లాన్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ మంచి రిజల్ట్ ఇస్తుందని ఆశిస్తున్నారట మేకర్స్. మరి ఈ వార్త కరెక్టేనా అంటే పూర్తి వివరాలు అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: