బర్త్ డే స్పెషల్: నటి తేజస్వి తండ్రి ఎవరో తెలుసా..?

Divya

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం. ఇలాంటి తరుణంలోనే ఒక తెలుగమ్మాయి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎవరో కాదు "తేజస్వి మాడివాడ" . తేజస్వి జూలై - 3 - 1991 వ సంవత్సరంలో బేగంపేటలో ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో చదువుకుంది. తరువాత సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసింది.ఈమె హైదరాబాదులో పుట్టి పెరిగింది.ఈమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్. తల్లి చిన్నతనంలోనే మరణించింది.. ఇక ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఆమె డాన్స్ నేర్చుకొని, ఆ డాన్స్ ను ఎంతో మంది పిల్లలకు నేర్పించేది. కొద్దికాలంపాటు డాన్సర్ ట్యూటర్ గా పనిచేసి, పాకెట్ మనీ కోసం డబ్బులు సంపాదించుకునేది.ఆ తర్వాత 2011లో ఏర్పాటు చేసిన అందాల పోటీలలో రన్నరప్ గామిగిలింది.

తేజస్వి డాన్స్ మాస్టర్ నుండి సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలను సంపాదించుకుంది. ఈమె 2013లో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మతో ఐస్ క్రీం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఎంతో భయానకంగా తెరకెక్కింది. ఇక ఇందులో ఈమె నటించిన తీరు అందరినీ బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇందులో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. వాణిజ్యపరంగా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ను కొట్టింది ఈ సినిమా.

మంచి ఫామ్ లో  ఉన్న తేజస్వి కి 2018లో టెలివిజన్ షో అయిన "బిగ్ బాస్" సీజన్ 2 లో పోటీదారుగా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. లవర్స్  సినిమాలో కూడా నటించింది. మరోసారి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అనుక్షణం సినిమాలో కూడా నటించింది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రం లో నిత్య మీనన్ కు కూతురు పాత్రలో పోషించి మంచి మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు. ఇక తరువాత పండగ చేస్కో , శ్రీమంతుడు వంటి సినిమాలలో కూడా నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: