ఆస్కార్ కమిటీలో ఉన్నది వీల్లేనా..?
ఇక మన బాలీవుడ్ విషయానికి వస్తే... బాలీవుడ్ కు చెందిన ముగ్గురికి ఈ కమిటీలో చోటు దక్కింది. వీరు ముగ్గరూ కూడా మహిళలే కావడం గమనార్హం. బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్, నిర్మాత, బుల్లి తెర సెలబ్రెటీ ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ ఈ కమిటీలో చోటు సంపాధించిన వారిలో ఉన్నారు. 395 మందికి చోటు కల్పించగా.. అందులో 46 శాతం మంది మహిళలు ఉండటం విశేషం. ద క్లాస్ ఆఫ్ 2021 పేరుతో ఈ కమిటీని ప్రకటించారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా.. ఆస్కార్ కమిటీలో ఇండియా వాళ్లకి చోటు దక్కింది. వీరు మన దేశంలో వివిధ భాషల్లో విడుదలయిన సినిమాల్లో ఉత్తమ సినిమాలను గుర్తించి.... ఆస్కార్ పోటీకి పంపిస్తారు. మన దేశం నుంచి కమిటీలో చోటు దక్కించుకుంటున్నా.. ఆస్కార్ ను మాత్రం గెలవలేకపోతున్నారు.
మన దేశంలోని ఫిల్మ్ మేకర్స్ తమ మూవీల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కు తప్పా... కంటెంట్ కు అంతగా ప్రాధాన్యం ఇవ్వరని చాలా మంది హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు విమర్శిస్తారు. వారు విమర్శించినట్లుగానే ఇండియాలో రూపొందించిన చిత్రాలకు ఆస్కార్ అవార్డులు రావడం లేదు. ఈ ఏడు ఆస్కార్ కమిటీలో ముగ్గరు లేడీ స్టార్లు చోటు దక్కించుకున్నారు. వీరైనా భవిష్యత్ లో మన సినిమా రేంజ్ ను ఆస్కార్ వరకు తీసుకెళ్తారేమో వేచి చూడాలి.