శ్రీనువైట్ల మళ్లీ అదే తప్పు.. ఇలా అయితే కష్టమే!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో శ్రీను వైట్ల లాంటి దర్శకుడికి వచ్చిన పరిస్థితి గతంలో ఏ దర్శకుడికి భవిష్యత్తులో ఏ దర్శకుడికి రాకూడదని కోరుకోవాలి. ఎందుకంటే వరస టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్థాయినుంచి ఇప్పుడు మినిమం రేంజ్ హీరోలతో కూడా సినిమాలు చేయలేని పరిస్థితి కి వచ్చాడు. ఆగడు సినిమా ఒక్కసారిగా దూసుకుపోతున్న ఆయన కెరీర్ ను ఆపేసింది. ఆ సినిమా తర్వాత శ్రీను వైట్ల చేసిన ఏ చిత్రం కూడా సక్సెస్ కాలేదు. దాంతో వరుస ఫ్లాపులు రావడంతో ఆయనను పక్కన పెట్టేశారు స్టార్ హీరోలు. 

ప్రస్తుతం మంచు విష్ణు తో డి అండ్ డి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది శ్రీనువైట్ల ఈ సినిమాను ప్రకటించగా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతుంది. మరోవైపు శ్రీనువైట్ల కు గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీనిపై స్పందించిన శ్రీనువైట్ల తనకు గ్యాప్ వచ్చిందని ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. ప్రకటించిన ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కరోనా కారణం అని శ్రీనువైట్ల వెల్లడించారు.

ఈ సినిమాతో పాటు మరో రెండు కథలను కూడా సిద్ధం చేసుకున్నానని ఈ సినిమాలకు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు. తాను తయారు చేసిన మూడు కథలు నాన్ స్టాప్ గా నవ్వించే కథలు అని ప్రేక్షకుల నా నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటారో ఈ సినిమాలు అలాగే ఉంటాయని వెల్లడించారు. ఢీ అండ్ ఢీ రిలీజ్ అయిన తర్వాత గ్యాప్ తీసుకోకుండానే మిగతా రెండు సినిమాలను తెరకెక్కిస్తారని శ్రీనువైట్ల పేర్కొన్నాడు. అయితే శ్రీను వైట్ల ఫ్లాప్ అయిన సినిమాలు చూసుకుంటే అవి కూడా కామెడీతో కూడిన యాక్షన్ సినిమాలే. మళ్లీ ఇప్పుడు అదే కోవలో సినిమాలు చేస్తున్నా అని చెప్పడంతో ఆయన అభిమానులు శ్రీనువైట్ల మళ్లీ అదే జోనర్ లో సినిమాలు చేస్తున్నాడు హిట్ కొడతాడా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: