టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరో కథానాయకుడు కాగా ఈ సినిమా దేశం మొత్తం విడుదల అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టడంతో రామ్ చరణ్ కూడా అదే విధంగా తన తదుపరి సినిమాలు కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే చిత్రం గా సౌత్ లోనే అతిపెద్ద దర్శకుడిగా పేరున్న శంకర్ తో సినిమా ను ఓకే చేసుకున్నాడు.
శంకర్ తో రామ్ చరణ్ సినిమా అధికారిక ప్రకటన కాగానే మెగా ఫ్యాన్స్ లో ఎంతో ఆనంద నెలకొంది. సాధారణ ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ పట్ల ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు. శంకర్ తన గత చిత్రాల తాలూకు లీగల్ సమస్యలు ఇప్పుడు ఎదుర్కోవడంతో సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందన్న వారి ఆశలకు గండి పడింది. రోబో 2 సినిమా తరువాత శంకర్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమా సీక్వెల్ ఇండియన్ టూ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారికి శంకర్ కు విభేదాలు రావడంతో అర్థంతరంగా తప్పుకున్నారు శంకర్.
ఆ క్రమంలోనే రామ్ చరణ్ తో ఓ సినిమాని బాలీవుడ్ లో రణబీర్ తో అపరిచితుడు రీమేక్ ను ప్రకటించాడు. అయితే దీనిపై లైకా ప్రొడక్షన్స్ వారు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇండియన్2 సినిమా పూర్తి అయ్యేంతవరకు శంకర్ మరో సినిమా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.కొన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి విచారణ హైకోర్టులో జరుగుతుంది. ఈ సమయం లో మెగా అభిమానులు రామ్ చరణ్ ఇలాంటి సమస్యలో ఇరుక్కున్నాడు ఏంటి శంకర్ కు ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాడా అని తమలో తాము చర్చించుకున్నారు. అయితే తాజాగా ఈ కేసులో హైకోర్టులో శంకర్ కు ఊరట లభించినట్లే అని తెలుస్తుంది. శంకర్ సినిమా చేయకుండా చూడాలని లైక ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అయినట్లు అని అంతా భావిస్తున్నారు.