ఒత్తిడిలో ప్రభాస్ కారణం ఏమిటంటే..?

Divya

ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా ఎదిగాడు. అంతే కాదు ఈయన చేస్తే కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తానంటూ, వాటి వైపు మొగ్గు చూపుతున్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ చేయబోయే ప్రతి సినిమా కూడా ఎక్కువ బడ్జెట్ ఉండడంతో పాటు, తన రెమ్యునరేషన్ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.వంద కోట్లను రెమ్యూనరేషన్ కింద తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉండడంతో, ఈయనపై ఇంట్లో ఒత్తిడి మొదలైందట. అది ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ప్రభాష్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు పొందిన వ్యక్తి. ఈయన స్నేహితులు అలాగే ఈయన కంటే చిన్నవయసు ఉన్న వాళ్లు కూడా, సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలకు కూడా జన్మనిచ్చారు. మన ప్రభాస్ మాత్రం 42 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండడం గమనార్హం. ఇందుకోసమే ఇంట్లో ఆయనపై ఒత్తిడి పెడుతున్నారట. నాలుగు పదుల వయసు మీద పడినప్పటికీ, ఇంకా పెళ్లి ఊసే ఎత్తని ప్రభాస్, తన  ఇంట్లో ప్రతి రోజు వారి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సంవత్సరంలోనైనా పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్న సమయంలో ఈయన వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు.

ఇక ఇదే కంటిన్యూ జరిగితే, ఆయన పెళ్లి చేసుకుంటారో లేదో అన్న భయంతో ఇంట్లో వీరి తల్లిదండ్రులు పెళ్లి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.  ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే, కేకే రాధా కృష్ణ దర్శకత్వం లో రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కబోతున్న రాధే శ్యామ్. ఈ సినిమా  జూలై 30 2021 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇందులో కథానాయికగా పూజాహెగ్డే నటించింది. అంతే కాదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సలార్ సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాను  2021 నవంబర్ లో విడుదల చేయాలని, చిత్రబృందం నిర్ణయించుకున్న తెలిసింది. ఇక అంతే కాదు ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆదిపురుష్  సినిమాలో కూడా ప్రభాస్ నటించబోతున్నారు. ఈ చిత్రం కూడా 2022లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. ఇక వీటన్నింటి తర్వాత మరొక సినిమాను కూడా వెయిటింగ్ లిస్టులో పెట్టాడు మన రెబల్ స్టార్ ప్రభాస్ . నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక సినిమా 2023 లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వరుస సినిమాలు చేసుకుంటూ పోతే ఇంక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఇంట్లో పెద్దలు ఈయనే ఒత్తిడి తీసుకొస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: