వీరిద్దరి గొడవకి అసలు కారణం ఏంటో తెలుసా ?
టాలీవుడ్ లో ఇప్పుడే ఎక్కువగా వాదనలు వినిపిస్తున్నాయి. మా ఎలక్షన్ల వలన ఈ వాదనలు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వనిత విజయ్ కుమార్.. సినీ ఇండస్ట్రీలో సీనియర్లు... జూనియర్లని ఎదగనీయడం లేదంటూ ఆ మధ్యన కామెంట్ చేసింది. అయితే ఈమె కామెంట్స్ కి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.
అలనాటి స్టార్ హీరోయిన్ లలో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్య కృష్ణ . ఇప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి, మంచి పాత్రల్లో నటించి అందరినీ మెప్పిస్తోంది. ఈమె తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించింది.కానీ బాలీవుడ్ లో మాత్రమే ఆమె నటించలేదు.
ఇక అసలు విషయానికొస్తే, రమ్యకృష్ణ ను ఒక హీరోయిన్ విమర్శల పాలు చేస్తోంది. ఆమె ఎవరో కాదు"వనిత విజయ్ కుమార్". ఇటీవల తమిళ్ లో ఒక డాన్స్ షో అయిన బీబీ జోడిగల్ అనే షో లో పాల్గొనింది. ఇంతకుముందు గడిచిన బిగ్బాస్ సీజన్ లో ఎవరైతే కంటెస్టెంట్ లుగా పాల్గొన్నారో, వారితో ఈ షోను నిర్వహించడం జరుగుతుంది. ఈ షోకి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరించడం విశేషం. అయితే ఈ షో లో వనిత విజయ్ కుమార్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినందుకుగాను..10 పాయింట్ల కి..1 పాయింట్ మాత్రమే ఆమెకు ఇచ్చింది.
అలా దాంతో ఈమె ఆ షో నుంచి వెంటనే బయటికి వెళ్ళింది. ఈమె అలా మధ్యలో రావడానికి రమ్యకృష్ణనే కారణం అని కామెంట్ రూపంలో తెలిపింది. ఈ విషయంపై హీరోయిన్ రమ్యకృష్ణని అడగగా.. అప్పుడు అందుకు సమాధానంగా రమ్యకృష్ణ షో లో ఏం జరిగిందో తననే అడగండి అంటూ రమ్యకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పింది.. రమ్యకృష్ణ ఇంత ఘాటుగా స్పందించింది అంటే, వనిత స్టేజ్ మీద చేయకూడనిది ఏమైనా చేసిందా అంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక వనిత విజయ్ కుమార్ మాత్రం 10 పాయింట్లకు ఒక పాయింట్ మాత్రమే ఇచ్చి నన్ను అవమాన పరిచింది అని అన్నారు. ఏదిఏమైనా ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని, మిగతావారు మాట్లాడితే బాగుంటుంది అని చెన్నై మీడియా వర్గాల సమాచారం.