మందు బాబులం పాట వెనుక ఆసక్తికర సంఘటన..!!

N.ANJI
సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో ఆయనకి తప్ప మరొకరికి పేరు రాదు. ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఎవ్వరు వెండితెర పై వెలుగులు చిమ్మలేరు. అయితే గబ్బర్‌సింగ్‌’ సినిమాలో కోట మెరుపులు మెరిపించారు. అయితే అప్పటివరకు కోట శ్రీనివాసరావు నటుడిగా మంచి గుర్తింపు ఉంది. కానీ.. ఆయనలో మంచి పాటగాడు కూడా ఉన్నాడని రుజువు చేసిన ఘనత హరీష్ శంకర్ కే దక్కుతుంది.

ఇక గబ్బర్‌సింగ్‌ సినిమాలో మందుబాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం…’ అంటూ సాగిన ఈ మందు పాట కోట నోట రావడం ఆలస్యం, జనాల నోట్లో కొన్ని ఏళ్లపాటు అలాగే ఉండిపోయింది. అయితే ఆ పాట ఏమి జరిగిందో కోట ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే కోట ఏదో సినిమా షూటింగ్‌ కోసం హడావిడిగా రెడీ అవుతున్నారంట. అప్పుడే ఆయనకి సడెన్ గా ఓ ఫోన్ వచ్చిందంట.

అయితే ఫోన్ చేసింది హరీశ్‌ శంకర్‌. ఇక కోటా హలో.. ఏంటబ్బాయ్‌.. హా’ అంటూ సరదాగా ముచ్చట పెట్టేలోపే ‘ఏం లేదు బాబాయ్‌, మీకు ఇవాళ ఏమైనా షూటింగ్‌ ఉందా?’, ‘ఉంటే ఏమి, నువ్వు రమ్మంటే నేను వస్తాను’ అన్నాడు. కట్ చేస్తే కోట కారు హైదరాబాద్‌ లోని ప్రసాద్‌ ల్యాబ్‌ లో దగ్గరికి వచ్చింది. ఇక హరీశ్‌ శంకర్‌ కోటాని రిసీవ్ చేసుకొని రికార్డింగ్‌ స్టూడియోలోకి తీసుకెళ్ళారంట. ఇక కోట అనుమానంగా రికార్డింగ్‌ రూమ్‌ తలుపు తీస్తే అక్కడ దేవిశ్రీప్రసాద్‌ నవ్వుతూ కనిపిచారంట.

ఇక అక్కడ యోగక్షేమాలు కనుకుంటున్న సమయంలోనే మందు బాబులం పాట ప్లే చేసి ‘ఇప్పుడు ఈ పాట మీరు పాడుతున్నారు’ అంటూ లిరిక్స్ పేపర్ చేతిలో పెట్టి పక్కకి వెళ్ళిపోయాడు డీఎస్పీ. అయితే కోటకు విషయం అర్థం కాలేదు. కాగా.. వాళ్ళ హడావిడి చూసి టెన్షన్ గానే ఆ పాటను పాడటానికి పైకి లేచారంట. ఇక గంటలో పాట రికార్డింగ్‌ పూర్తయింది. అయితే కోట పాట కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: