బాలయ్య జోరు ఇప్పట్లో తగ్గేలా లేదే!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాడు.  కరోనా కారణంగా మూసివేసిన థియేటర్ లు ఓపెన్ చేస్తుండడంతో త్వరలోనే థియేటర్లకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజుల షూటింగ్ మిగిలిపోవడం తో బోయపాటి శ్రీను ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ లుక్స్ కు సంబంధించిన రెండు టీజర్లు ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఇకపోతే ఈ సినిమా తర్వాత హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని నీ లైన్ లో పెట్టుకున్న విషయం తెలిసిందే. క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న గోపీ చంద్ మలినేని బాలకృష్ణతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అని ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో తెరకెక్కబోతుంది. ఇదే కాకుండా బాలకృష్ణ యంగ్ హీరోలకు పోటీ ఇస్తు మరి కొన్ని సినిమాలను కూడా ఒప్పుకున్నారని సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో యంగ్ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట బాలకృష్ణ.

అలాగే సి కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ తీసుకున్నారట. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్  ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు బాలయ్యకు భారీ అడ్వాన్సులు ఇచ్చాయట. అలాగే రాజ్ కందుకూరి సైతం బాలయ్యతో సినిమా ప్లాన్ చేశారట. ఇటీవలే ఆయన బాలయ్యను కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటి రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా బాలయ్యతో సినిమా చేయాలనుకుంటుంది. ఇవి కాకుండా మరి కొందరు నిర్మాతలు బాలయ్య డేట్స్ కోసం ఎగబడుతున్నారు. బాలయ్య కమిట్మెంట్ఇచ్చిన ప్రాజెక్టులకు ఇంకా కథలు సెట్ అవ్వాలి అందుకే కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదట. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మరో మూడేళ్ళ సమయం పట్టడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: