యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరో వైపు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి అందులో తొలిసారిగా "నిను వీడని నీడను నేనే" చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా తన సొంత నిర్మాణంలో "వివాహ భోజనంబు" టైటిల్ తో ఓ సినిమాని ప్రకటించాడు. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై "వివాహ భోజనంబు" సినిమా రూపుదిద్దుకోనుంది. సందీప్ కిషన్, శినీష్ భాగస్వామ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ మరియు కమెడియన్ సత్య ప్రధానపాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించి సక్సెస్ ను అందుకుంటుందని ఆశిస్తున్నారు మేకర్స్.
అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీలో గెస్ట్ రోల్ చేయనున్నట్లు సమాచారం. తనకి మంచి ఫ్రెండ్ అయిన సందీప్ కిషన్ అడగడంతో ఒకే చెప్పారట రకుల్. పేరుకి అతిధి పాత్ర అయినా రకుల్ కనిపించబోయే నిడివి ఎక్కువేనని భోగట్టా. ఈ పాత్రలో మరింత గ్లామరస్ లుక్ లో కనిపించనున్నారట రకుల్. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ అగ్ర హీరోయిన్ గా మనలను అందుకుంటున్నారు.
ఆఫర్లు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్న రకుల్ పోకస్ పెడితే తిరిగి ఫుల్ ఫామ్ లోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు ఆమె ఫాన్స్. నిజజీవితంలోనూ తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించి బిజినెస్ మాన్ గా గుర్తింపు పొందిన సందీప్ కిషన్ ఇప్పుడు దీనికి కనెక్ట్ అయ్యేలా "వివాహ భోజనంబు" సినిమా తీయబోతుండడం విశేషం. మరి నిర్మాతగా ముందు ముందు మరిన్ని సినిమాలు తీయాలంటే ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం. మరి చూద్దాం.