దిల్ రాజుతో రామ్ చరణ్.. మెగా ఓటిటి ప్లాన్..!

shami
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంత ఓటిటి ఫ్లాట్ ఫాం సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగులో ఆహా సూపర్ గా దూసుకెళ్తుంది. కంప్లీట్ తెలుగు కంటెంట్ తో ఆహా అటు అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇస్తుంది. ఈమధ్యనే ఆర్జీవి స్పార్క్ అని ఓటిటి మొదలు పెట్టాడు. చిన్నా చితకావి ఎన్నో ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా దిల్ రాజు కూడా కొత్త ఓటిటి ప్రారంభించాలని చూస్తున్నారట. దిల్ రాజు ఓటిటిలో రాం చరణ్ కూడా భాగం అవుతున్నాడని టాక్.
ఈనాడు రామోజీరావు నుండి కొత్త ఓటిటి ఒకటి స్టార్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. మరోపక్క సురేష్ బాబు, నాగార్జున కలిసి సొంత ఓటిటి ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. వీటితో పాటుగా దిల్ రాజు కూడా తన సొంతంగా ఒక ఓటిటి ప్లాన్ చేస్తున్నారట. ఎలాగు ప్రొడక్షన్ ఉంది కాబట్టి ఒరిజినల్ కంటెంట్ కు కొదవ ఉండదు. అప్కమింగ్ డైరక్టర్స్ తో మంచి వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ సినిమాలు చేయొచ్చని దిల్ రాజు మెగా ప్లాన్. దీనికి రాం చరణ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.
దిల్ రాజు సొంత ఓటిటి పెడితే మాత్రం వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. తెలుగులో ఆహా సక్సెస్ అవగా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఓటిటిలు కూడా ఆహా రూట్ ను ఫాలో అవుతున్నాయి. ఆహా కూడా ఒరిజినల్ కంటెంట్ తో వెబ్ సీరీస్ లు బాగానే ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఆహా ప్రమోషన్స్ బాగా చేస్తుంది. అందుకే ఆ రేంజ్ లో క్లిక్ అయ్యింది. ఓటిటి రంగంలోకి దిల్ రాజు కూడా దిగితే పోటీ పెరుగుతుందని చెప్పొచ్చు.  దిల్ రాజు ఓటిటి పై మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. దిల్ రాజు ఓటిటి వస్తే మాత్రం ఆహా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: