జిమ్ లో తెగ వర్క్ ఔట్స్ చేస్తున్న రాశీ..?

Suma Kallamadi
టాలీవుడ్ గ్లామ‌ర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుని చాలా సినిమాలతో బిజీగా ఉంటోంది రాశీఖ‌న్నా. అలాగే ఈ బ్యూటీ సోషల్‌మీడియా ద్వారా కూడా చాలా మంది అభిమానులకు కావాల్సినంత టైమ్ పాస్‌ను పంచుతున్నారు రాశీ. దీంతో ఆమె తరచూ త‌న ఫోటోషూట్‌లు చేస్తూ ఆ ఫొటోల‌తో కుర్రకారుని మంత్రముగ్దులను చేస్తున్న రాశీ ఇప్పుడు కూడా అలాగే చేసింది.
సోషల్ మీడియాలో హాట్ బ్యూటీ రాశీ ఖన్నా ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాశీ ఖన్నా మూవీ తెరపై అంతగా అందాలను ప్రదర్శించే అమ్మాయి కాద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కాగా ఈ మధ్య ఆమె త‌న రూట్ మార్చేసినట్టు కనిపిస్తోంద‌ని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చాలా బోల్డ్ రోల్‌లో చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు రాశీ. ఇక ఆ తరువాత బికినీలో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేస్తోందిఈ పంజాబ్ బ్యూటీ.
ఒకప్పుడు చాలా బొద్దుగుమ్మలా ఉన్న రాశీ మాత్రం ఇప్పుడు నాజూగ్గా మారిపోయి అంద‌రికీ షాక్ ఇస్తోంద‌ని చెప్పాలి. ఆమె ఇందుకోసం ఏకంగా ఏడాదికి పైగా కష్టపడి జీరో సైజ్‌లోకి వచ్చేశారిన తెలుస్తోంది. తెలుగుతో పాటు సౌత్‌లోనే ఇతర ఇండస్ట్రీలలోనూ వరుస మూవీలతో ఆమె చాలా బిజీ యాక్ట‌ర్ గా మారిపోయారు. ఆమె ఓ వైపు మూవీలు చేస్తూనే ఇంకోవైపు సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చేస్తున్నారు.
ఆమె త‌న ఫిజిక్ కోసం ఏకంగా గంటల పాటు జిమ్‌లో ఆమె కసరత్తు చేస్తున్నారని స‌మ‌చారం. ఇక ఆమె తన జిమ్‌కి సంబంధించిన ఓ వీడియోని రీసెంట్‌గా రాశీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసింది. దీనికి ఆమె లోడింగ్ అంటూ ఆమె క్యాప్షన్ ఇవ్వ‌డంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు అంద‌రూ ఫిదా అయ్యారు. ఇక హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఈ వీడియోకు లవ్ సింబల్‌ని కామెంట్‌గా పెట్ట‌డం చ‌ర్చ‌నీయా‌మైంది.

Your browser does not support HTML5 video.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: